The Indian express releases top 100 power list 2025: ఇటీవల తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి తెలంగాణలో పాగా వేసింది. రేవంత్ రెడ్డి సీఎంగా పగ్గాలు చేపట్టారు.ఈ క్రమంలో ప్రస్తుతం తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పాలనను ఎండగడుతూనే.. ప్రజలకు ఇచ్చిన హమీలను నెరవేర్చడంతో ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ అపోసిషన్ పార్టీల నుంచి వస్తున్న ఆరోపణలకు తనదైన స్టైల్ లో.. కౌంటర్ లు సైతం వేస్తున్నారు.ఈ నేపథ్యంలో 2025 కు గాను.. ద ఇండియన్ ఎక్స్ ప్రెస్.. వివిధ రంగాలకు చెందిన శక్తివంతుల జాబితాను విడుదల చేసింది.
దీనిలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గతేడాది కన్న.. ఏకంగా 11 స్థానాలు ఎగబాకి.. 28వ స్థానం దక్కించుకున్నాడు. 2024 సంవత్సరపు జాబితాలో 39 స్థానంలో నిలిచారు. దేశంలో రాజకీయ, వ్యాపార, క్రీడా, వినోద రంగాల్లో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులు ఈ జాబితాలో ఉన్నారు. ముఖ్యంగా నాయకత్వలక్షణలు, దూకుడు స్వభావం, వ్యూహత్మక రాజకీయాలతో ముందుకు వెళ్తున్నవారికి సర్వేలలో వచ్చిన ర్యాంకులు ఇప్పుడు చూద్దాం.
ఒక ప్రాంతీయ నాయకుడినే కాకుండా దేశంలోనే అత్యంత శక్తిమంతమైన, చురుకైన ముఖ్యమంత్రుల్లో ఒకరిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిర్భవించారనిచెప్పుకొవచ్చు. ఈ జాబితాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇండియా కూటమిలోని ఇతర ప్రముఖులైన సీఎంల సరసన నిలిపింది. శక్తిమంతులై వంద మంది జాబితాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మొదటి 10 స్థానాల్లో ఉన్నారు.
* విధానపరమైన నిర్ణయాలతో...
రైతు కుటుంబాలకు రూ. 21 వేల కోట్ల రుణ మాఫీ చేయడం, క్వింటాల్ ధాన్యానికి రూ.500 బోనస్ ఇవ్వడం, మహిళా స్వయం సహాయక సంఘాలకు సోలార్ పవర్ ప్లాంట్లు, పెట్రోల్ బంక్‌లు, ప్రీమియం రిటైల్ స్టోర్ల వంటి వ్యాపార అవకాశాలను కల్పించడం, యువతను నిపుణులుగా తీర్చిదిద్దే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు, ట్రాఫిక్ పోలీస్ విభాగంలో ట్రాన్స్‌జెండర్‌ల నియామకం వంటి అనేక విధానపరమైన వినూత్న నిర్ణయాలు దేశంలోనే చర్చనీయాంశాలుగా మారాయి.
నియోజకవర్గాల పునర్విభజనపై చెన్నై సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యక్తం చేసిన దృఢమైన అభిప్రాయాలు కూడా ఆయనకు జాతీయ స్థాయిలో ప్రాధాన్యం దక్కేలా చేశాయి. ఒకవైపు పారదర్శకమైన పాలన అందిస్తునే.. మరోవైపు అపోసిణన్ పార్టీలకు సీఎం రేవంత్ చుక్కలు చూపిస్తున్నారు.
Read more: KTR Vs Revanth Video: నాకు రంకులు అంటకట్టింది మీరు.. అసెంబ్లీలో రెచ్చిపోయిన కేటీఆర్.. వీడియో వైరల్..
భారతీయ శక్తిమంతులైన జాబితాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చోటు లభించడం భారత రాజకీయాల్లో కీలక మార్పునకు సంకేతమని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ప్రాంతీయ నేతలు ఇప్పుడు జాతీయ విధానాల రూపకల్పనలో మరింత ప్రభావం చూపుతున్నారనడానికి ఇదే నిదర్శమని వారు పేర్కొన్నారు. మరోవైపు మొదటి రెండు స్థానాల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్, తమిళ నుంచి తలపతి విజయ్ నిలిచారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter









