
Jewel Robbery: నగల వ్యాపారికి మత్తు మందు ఇచ్చి ఇళ్లంతా దోపిడీ చేసిన దారుణ ఘటన హైదరాబాద్ కాచిగూడలో జరిగింది. వ్యాపార వేత్త హేమరాజ్ ఇంట్లో రెండు కిలోల బంగారు ఆభరణాలు, మూడు కోట్ల నగదు చోరీ చేశారు. ఇంట్లో పనివాళ్లైన నేపాలీలు.. హేమరాజ్ దంపతులకు రాత్రి భోజనంలో మత్తు మందు కలిపి వాళ్లు మత్తులోకి జారుకున్న తర్వాత ఇంట్లో దోపిడికి స్కెచ్ వేశారు. అందుకు ప్రణాళికలు రచించారు.
రాత్రి మత్తు మందు కలిపిన భోజనం తిన్న హేమరాజ్ దంపతులు అపస్మారక స్థితిలోకి వెళ్లిన వెంటనే ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. ఉదయం వాకింగ్ కు హేమరాజ్ రాకపోవడంతో ఇంటికి వచ్చిన స్నేహితుడు విషయం తెలుసుకుని పోలీసులకు ఇన్ఫార్మ్ చేశాడు.
స్పృహ తప్పిన హేమరాజ్ దంపతులను హాస్పిటల్ లో చేర్పించాడు. ఇంట్లో నగదు, నగలు ఎత్తుకెళ్లిన నేపాలీ పనివాళ్ల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe