తెలంగాణ ఎన్నికల ఫలితాల విడుదల నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు జరకుండా ఉండేందుకు పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఈ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు మద్యం అమ్మకాలపై నిషేదం విధించారు. అలాగే  కౌంటింగ్ కేంద్రాల్లో సెల్ ఫోన్లు నిషేదం విధించారు. అలాగే కౌంటింగ్ రోజు విజయోత్సవ ర్యాలీలకు అనుమతి నిరాకరించారు. కౌంటింగ్ కేంద్రాల్లో వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఐదుగురు అంతకు మంచి వ్యక్తులు గుమ్మి గూడకూడదు. కౌంటింగ్ పరిసర ప్రాంతాల్లో మూడంచెల భద్రత ఏర్పాట్లు చేశారు. భద్రతా చర్యల్లో భాగంగా ఒక్కో కౌంటింగ్ కేంద్ర వద్ద ఏసీపీ స్థాయి అధికారిని నియమించారు. అలాగే ఒక్కో నియోజకవర్గానికి డీఎస్పీ స్థాయి అధికారిని నియమించి భద్రతా చర్యలు పర్యవేక్షిస్తున్నారు. పోలీసుల నిబంధనలు ఎవరైన ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసు శాఖ హెచ్చరికలు జారీ చేసింది


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

*కౌంటింగ్ కేంద్ర పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు
* ఉదయం 6 గంటల నుంచి మద్యం అమ్మాకాలు నిషేదం
* కౌంటింగ్ కేంద్రాల్లో సెల్ ఫోన్లు నిషేదం
* విజయోత్సవ ర్యాలీలకు అనుమతిలేదన్న పోలీసులు
* కౌంటింగ్ కేంద్రాల్లో మూడంచెల భద్రత ఏర్పాట్లు