Drunk And Drive: డ్రంక్‌ అండ్ డ్రైవ్‌ రికార్డులు బద్దలు.. 'గిన్నీస్‌ బుక్‌లో' నీ పేరు పక్కా బ్రో!

This Drunk And Drive Points Creates New Record In Panjagutta: వీడెవడండి ఇంతలా తాగేశాడు. అసలు డ్రంక్‌ డ్రైవ్‌ టెస్టుల్లోనే రికార్డు నెలకొల్పాడు. ఒక వేళ గిన్నీస్‌ బుక్‌ రికార్డుల్లో నమోదు చేస్తే మాత్రం ఇతగాడి పేరే ముందుంటుంది. అంతలా రికార్డు నమోదు చేసిన సంఘటన వైరల్‌గా మారింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 24, 2025, 09:54 PM IST
Drunk And Drive: డ్రంక్‌ అండ్ డ్రైవ్‌ రికార్డులు బద్దలు.. 'గిన్నీస్‌ బుక్‌లో' నీ పేరు పక్కా బ్రో!

Drunk And Drive New Records: మద్యం సేవించి వాహనం నడిపిన సంఘటనలు ఆసక్తికరంగా ఉంటాయి. రాత్రిపూట జరిగే డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ పరీక్షల సమయంలో తాగుబోతులు చేసే రచ్చ మామూలుగా ఉండవు. కొందరు వాగ్వాదానికి దిగగా.. మరికొందరు వింత వింత సమాధానాలతో వైరల్‌ అవుతుంటారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ పరీక్షలను చూసే వారికి ఎంతో వినోదం అందిస్తుంటాయి. అలాంటి సంఘటనే మరొకటి జరిగింది. ఇది అలాంటి ఇలాంటి సంఘటన కాదు ఏకంగా గిన్నీస్‌ బుక్‌ రికార్డ్స్‌లో నమోదయ్యే సంఘటన జరిగింది. ఈ సంఘటన చూసి పోలీసులే విస్తుపోయారు. దెబ్బకు అతడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

Add Zee News as a Preferred Source

Also Read: Anasuya Bharadwaj: 'వాడు పైకి వచ్చి ఉంటే అదే జరిగేది'.. 'మిడిల్ ఫింగర్'పై అనసూయ రియాక్షన్

హైదరాబాద్‌లో నిత్యం వేలాది వాహనాలు సంచరించే అత్యంత రద్దీ ఉండే పంజాగుట్ట వైపు ఓ వాటర్‌ ట్యాంకర్‌ వచ్చింది. ఉప్పల్‌ నుంచి పంజాగుట్ట మీదుగా అమీర్‌పేట వైపు వెళ్తున్న ట్యాంకర్‌ను అక్కడ ఉన్న ట్రాఫిక్‌ పోలీసులు ఆపారు. ట్యాంకర్‌ డ్రైవర్‌ వివరాలు తెలుసుకోగా అతడు మద్యం మత్తులో ఉన్నాడని గుర్తించారు. వెంటనే బ్రీత్‌ ఎనలైజర్‌ తీసుకువచ్చి డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ పరీక్ష చేశారు.

Also Read: Group 1 Mains: తెలంగాణ గ్రూప్‌ 1లో బిగ్‌ ట్విస్ట్‌.. హైకోర్టును ఆశ్రయించిన అభ్యర్థులు

పంజాగుట్ట ట్రాఫిక్‌ ఎస్సై ఆంజనేయులు బ్రీత్‌ ఎనలైజర్‌తో పరీక్షించగా దిమ్మతిరిగే ఫలితం వచ్చింది. సాధారణంగా వంద బీఏసీ పాయింట్లు దాటితేనే రికార్డు అనుకుంటే డ్రైవర్‌కు చేసిన పరీక్షలో 325 బీఏసీ పాయింట్లు నమోదయ్యాయి. ఇది చూసి పోలీసులు నివ్వెరపోయారు. ఆల్కహాల్‌ శాతం 325 పాయింట్లు దాటడంతో అతడిని వెంటనే అదుపులోకి తీసుకుని ట్యాంకర్‌ను సీజ్‌ చేశారు. ఎంత తాగావని ట్రాఫిక్‌ ఎస్‌ఐ ప్రశ్నించారు. అయితే అతడు సమాధానం చెప్పకుండా అమాయకంగా నిలబడడం విశేషం. దీనికి సంబంధించిన వీడియో, వార్త వైరల్‌గా మారింది. ఎన్ని లీటర్లు తాగావని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఎంత ఫ్రస్ట్రేషన్‌లో ఉంటే అంత తాగావు అన్న అని మరికొందరు కామెంట్‌ చేస్తున్నారు. 

ఏ స్కోర్‌..
సాధారణంగా డ్రంకన్‌ అండ్‌ డ్రైవ్‌ పరీక్షల్లో బ్రీత్‌ ఎనలైజర్‌ మిషన్‌ ఆల్కాహాల్‌ శాతం పరీక్షిస్తారు. 100 మిల్లీ లీటర్ల రక్తంలో శాతం 30 మిల్లీ గ్రాములు దాటితే కేసు నమోదు చేస్తారు. 50 మిల్లీ గ్రాముల ఉంటే ఆ వ్యక్తి స్పృహాల్లో లేనట్లు గుర్తిస్తారు. బ్రీత్‌ ఎనలైజర్‌లో వందకు మించి రీడింగ్‌ నమోదైన సందర్భాలు కొన్ని మాత్రమే ఉన్నాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News