)
TS 10th Result 2025: తెలంగాణ SSC (పదో తరగతి) ఫలితాలు. నేడు విడుదల అయ్యాయి. మార్చి 21 నుండి ఏప్రిల్ 4 వరకు రాష్ట్రవ్యాప్తంగా 2,650 కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షలను మొత్తం 5,09,403 మంది విద్యార్థులు హాజరు అయ్యారు. వీరిలో 2,58,895 మంది బాలురు, 2,50,508 మంది బాలికలు ఉన్నారు. ఈ సంవత్సరం జిపిఏ విధానాన్ని తొలగించారు ప్రతి సబ్జెక్టుకు గ్రేప్స్ అదేవిధంగా మార్కులు అందించనున్నారు. గతంలో జిపిఏ విధానం కింద 10 పాయింట్లకు గాను గ్రేడింగ్ ఇచ్చేవారు. అయితే ఈసారి మాత్రం ప్రతి సబ్జెక్టుకు గ్రేడులు అదే విధంగా మార్కులు కూడా ఉంటాయి. పాస్ అయితే "Pass", ఫెయిల్ అయితే "Fail" అని స్పష్టంగా మార్క్ మెమోలో చూపిస్తారు. పదో తరగతి ఫలితాలను ఆన్లైన్ ద్వారా చెక్ చేసుకోవాలి అనుకున్నట్లయితే. https://bse.telangana.gov.in/ సైట్ ద్వారా నేరుగా తెలుసుకోవచ్చు.
SSC మార్చి-2025 పరీక్షలకు మొత్తం 5,07,107 మంది విద్యార్థులు హాజరు కాగా 4,96,374 మంది విద్యార్థులు రెగ్యులర్ ప్రాతిపదికగానూ, 10,733 మంది విద్యార్థులు ప్రైవేటుగా హాజరయ్యారు.
పదవ తరగతి రెగ్యులర్ విద్యార్థుల ఉత్తీర్ణత శాతం 92.78 %.
>> బాలుర ఉత్తీర్ణత శాతం 91.32 %., బాలికల ఉత్తీర్ణత శాతం 94.26 %.
>> బాలికలు, బాలుర కంటే 2.94 % అధికంగా ఉత్తీర్ణత సాధించారు.
ప్రైవేట్ విద్యార్థులు:
>> రాష్ట్రంలో పదవ తరగతి ప్రైవేటు విద్యార్థుల ఉత్తీర్ణత శాతం 57.22 %.
>> బాలుర ఉత్తీర్ణత శాతం 55.14 %, బాలికల ఉత్తీర్ణత శాతం 61.70 %.
బాలికలు, బాలుర కంటే 6.56 % అధికంగా ఉత్తీర్ణత సాధించారు.
>> ఈ సంవత్సరం 4,629 పాఠశాలలు 100% ఉత్తీర్ణత సాధించాయి.
>> ఈ సంవత్సరం 2 పాఠశాలలు జీరో శాతం ఫలితాలు పొందాయి.
>> రాష్ట్రంలో మంచిర్యాల జిల్లా అన్ని జిల్లాల కంటే 99.29 % ఉత్తీర్ణత శాతంతో మొదటి స్థానంలో ఉంది.
>> వికారాబాద్ జిల్లా అన్ని జిల్లాల కంటే అతి తక్కువ ఉత్తీర్ణత శాతంతో 73.97 % పొంది చివరి స్థానంలో ఉంది.
పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 3వ తేదీ నుంచి జూన్ 13వ తేదీ వరకు నిర్వహిస్తారు. హెడ్మాస్టర్ లాగిన్ ద్వారా మే 16వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe