Tollywood Speech About Ibomma Ravi: ఎన్నో ఏళ్లుగా పైరసీపై పోరాడుతున్నాం. దాన్ని అరికట్టడానికి అనేక సమస్యలు కూడా ఎదుర్కొన్నాం, పైరసీ మహమ్మారిని ఎదుర్కోవడానికి గత సీపీ సీవీ ఆనంద్‌తోపాటు ప్రస్తుత సీపీ సజ్జనార్ కూడా చూపిన చొరవ అభినందనీయమని సినీ నటుడు చిరంజీవి అన్నారు. పైరసీ చేయడమే కాకుండా పోలీసులకే సవాలు తట్టుకోలేక పోయామని కూడా ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో ఐబొమ్మ రవి అరెస్టు తర్వాత హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను సినీ ప్రముఖుల చిరంజీవి, నాగార్జున, రాజమౌలి, దిల్ రాజులు కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా పైరసీ భూతంతో లక్షలాది మంది సినీ కార్మికులు నష్టపోతున్నారు.
ఇప్పటికే కొన్ని లక్షల మంది డేటాను ఇమ్మడి రవి విక్రయించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సినిమాలో ఏముంది ఫ్రీగా చూడొచ్చు కదా అని అనుకున్న వాళ్ళు పెద్ద చిక్కుల్లో పడతారు అని డైరెక్టర్ రాజమౌలి కూడా అన్నారు. సినిమాలను పైరసీ చేసి వాళ్ళు సంపాదిస్తున్నారు. వ్యక్తిగత డేటాను మీరు ఇస్తున్నారు. కాబట్టి మీరే వారి చేతిలో పెడుతున్నారు. అది చాలామందికి తెలియదు. మీరు ఐబొమ్మ సినిమా చూస్తున్నారు. పైరసీలో సినిమా చూస్తున్నారు అంటే మీ పేరు, ఫోన్ నెంబర్, ఇమెయిల్ డేటా అంత వాళ్లకు తెలిసిపోతుంది. ఈ నేపథ్యంలో మీరు సైబర్ బారిన పడే అవకాశం కూడా ఉంది అని రాజమౌలి పేర్కొన్నారు. పైరసీ వల్ల నష్టపోయేది మీరే అని ఆయన చెప్పుకొచ్చారు.
అంతేకాదు భస్మాసుర హస్తంలా ఇమ్మడి రవి కూడా పోలీసులకు సవాల్ విసిరి తన తల మీద తానే చేయి పెట్టుకున్నాడు. ఏది ఊరికే రాదు అని అన్నారు. ఎలా వస్తున్నాయో ఒకసారి ఆలోచించరా? పర్సనల్ డేటా ఇమ్మడి రవి అమ్ముకున్నాడు. పెద్ద మొత్తంలో సర్వర్లు మెయింటెనెన్స్ చేయాలంటే అతనికి డబ్బు కావాలి. ఆ డబ్బు అంతా మీరే ఇస్తున్నారు. సినిమా వాళ్ళ కంటే కూడా అందుకే మీరే ఎక్కువగా నష్టపోతారని సినీ డైరెక్టర్ రాజమౌలి సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, రవి అరెస్టు మాత్రం సినీ ఫక్కీలో జరిగింది ఒక విలన్ ఛాలెంజ్ విసిరితే.. హీరో పట్టుకొని జైలుకు పంపిస్తాడు. పైరసీ సైట్లతో మాకంటే ప్రజలకు ఎక్కువ నష్టం. పైరసీ చూసి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని సూచించారు.
ఇక సినిమా పైరసీ ముఠాను అరెస్టు చేసినందుకు హైదరాబాద్ పోలీసులను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అభినందించారు. డబ్బు రూపంలోనే కాదు సృజనాత్మకతను కూడా పెట్టుబడిగా పెట్టి నిర్మించే సినిమాలకు ఇంటర్నెట్లో అదే రోజు పెట్టడం వల్ల చిత్ర సీమ తీవ్రంగా నష్టపోతుందన్నారు. ఆ ముఠాలను కట్టడి చేయడం దర్శక నిర్మాతలకు సాధ్యం కాలేదు. పైరసీ కీలకంగా ఉన్న ఐ బొమ్మ హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేయడం హర్షనీయమన్నారు.
ఇక సిటీ సజ్జనార్ కూడా ఐ బొమ్మ రవి అరెస్టుకు మాజీ భార్య సమాచారం ఇచ్చిందన్న వార్తను ఖండించారు. ఇన్ఫర్మేషన్ ఎవరూ ఇవ్వలేదు. పోలీసుల స్వతహాగా పట్టుకున్నారని స్పష్టం చేశారు. అయితే చాలామంది పోలీసులపై మీమ్స్ చేశారు. వారిపై తప్పకుండా చర్యలు కూడా తీసుకుంటామని అన్నారు. అంతేకాదు ఐబొమ్మ రవి 110 డొమెయిన్లు కొనుగోలు చేసి 21 వేల మూవీలను అప్‌లోడ్ చేశాడు. రవి కరిబియన్ దీవుల్లో సెయింట్ నేవీ దేశం పౌరసత్వం కూడా పొందాడు. ఇండోనేషియా లేదా స్విట్జార్లాండ్ దేశాల్లో సర్వర్లు ఏర్పాటు చేసి ఐ బొమ్మ ప్రమోట్ చేశాడు. ఏపీకే ఫైల్స్ ప్రమోట్ చేసి ప్రజల ఫోన్లో ఉన్న మాల్వేర్ చొప్పించాడు అని సీపీ సజ్జనార్ వివరించారు.
Also Read: ఎల్లుండి అందరి ఖాతాల్లో రూ.7000 జమా.. మంత్రి అచ్చెన్నాయుడు అధికారిక ప్రకటన..!
Also Read: బీఎస్‌ఎన్‌ఎల్ సిల్వర్ జూబ్లీ బంపర్ ప్లాన్.. 2.5 జీబీ డైలీ డేటా, 30 రోజుల వ్యాలిడిటీ ప్యాక్..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









