Betting Apps Case: మొన్న డ్రగ్స్..ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ మాఫియాలో చిక్కుకున్న టాలీవుడ్

Betting Apps Case: తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ మాఫియా కలకలం రేపుతోంది. ఒకరు కాదు ఇద్దరు కాదు..ముగ్గురు కాదు ఏకంగా 25 మంది ఇందులో ఇరుక్కుని ఉన్నారు. తెలుగు సినిమా పరిశ్రమకు డ్రగ్స్ తరువాత బెట్టింగ్ యాప్స్ కేసు వెంటాడుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 20, 2025, 03:20 PM IST
Betting Apps Case: మొన్న డ్రగ్స్..ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ మాఫియాలో చిక్కుకున్న టాలీవుడ్

Betting Apps Case: బెట్టింగ్ యాప్స్ కేసు రాష్ట్రంలో సంచలనం రేపుతోంది. వీటి వల్ల అప్పులపాలై 1000 మంది గత ఏడాది ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. అందుకే హైదరాబాద్ పోలీసులు బెట్టింగ్ యాప్స్ కేసును సీరియస్‌గా తీసుకున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న సెలెబ్రిటీలకు నోటీసులు పంపిస్తున్నారు. 

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్‌పై నిషేధం ఉంది. కానీ డబ్బుల కోసం సెలెబ్రిటీలు ముఖ్యంగా తెలుగు సినీ పరిశ్రమలోని కొందరు వీటిని ప్రమోట్ చేస్తున్నారు. సెలెబ్రిటీ స్థాయిని బట్టి పారితోషికం అందుతుంది. బెట్టింగ్ యాప్స్‌తో పాటు వాటిని ప్రమోట్ చేసినవారిపై కొరడా ఝులిపించిన పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. మొత్తం 25 మంది సెలెబ్రిటీలపై కేసులు పెట్టారు. వీరిలో నటీ నటులతో పాటు యాంకర్లు, ఇన్‌ఫ్లూయెన్సర్లు ఉన్నారు. బెట్టింగ్, గ్యాంబ్లింగ్ చట్టం ప్రకారం ఇప్పటికే దగ్గుపాటి రాణా, ప్రకాశ్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ళపై పోలీసులు 318(4), 112 రెడ్ విత్ బీఎన్ఎస్ 3, 3(ఎ), ఐటీ యాక్ట్ 66 డి ప్రకారం కేసులు నమోదయ్యాయి. ఇక యాంకర్లు విష్ణుప్రియ, శ్యామల, రీతూ చౌదరి, సుప్రీత, సన్నీ, సుధీర్, అజయ్‌లతో పాటు మరో నలుగురికి నోటీసులు ఇచ్చారు. వీరితో పాటు శ్రీముఖి, వర్షిణి, సిరి హనుమంతు, వసంతి కృష్ణన్, శోభాశెట్టి, అమృత చౌదరి, నేహా పఠాన్, ఇమ్రాన్ ఖాన్, టేస్టీ తేజ, హర్షసాయిలపై కూడా కేసు నమోదైంది. 

ఎవరెవరు ఏయే బెట్టింగ్ యాప్స్, వెబ్‌సైట్స్ ప్రమోట్ చేశారో వారందరిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నారు. మొత్తం 25 మందికి విచారణకు హాజురు కావల్సిందిగా నోటీసులు పంపిస్తున్నారు. గతంలో డ్రగ్స్ కేసులో చిక్కుకున్న టాలీవుడ్ ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ఊబిలో చిక్కుకుంది. 

ప్రస్తుతం బెట్టింగ్ యాప్స్ వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుంది. బెట్టింగులు, గేమింగ్స్ పేరుతో ప్రజల జీవితాల్ని అతలాకుతలం చేస్తున్నవారికి అడ్డుకట్ట వేయాలని ఆదేశాలు జారీ చేసింది. యాప్స్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేయాలని పోలీసులు నిర్ణయించారు. ఇందుకు తగ్గ కార్యాచరణ సిద్ధమౌతోంది. 

Also read: Vishnupriya Arrest: విష్ణుప్రియ అరెస్ట్ తప్పదా, బెట్టింగ్ యాప్ కేసులో ఫోన్ సీజ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News