Bandi Sanjay: 'తెలంగాణ బడ్జెట్‌ మొత్తం 'ఓం భూం బుష్'.. అందులో డొల్లతనమే'

Bandi Sanjay Kumar Comments About Telangana Budget Its Total Trash: తెలంగాణ కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ ఒక్కమాటలో చెప్పేశారు. అందులో ఏమీ లేదని చెబుతూ అంతా 'ఓం భూం బుష్‌' అని వ్యాఖ్యానించారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 19, 2025, 04:38 PM IST
Bandi Sanjay: 'తెలంగాణ బడ్జెట్‌ మొత్తం 'ఓం భూం బుష్'.. అందులో డొల్లతనమే'

Bandi Sanjay Kumar: 'అబద్దాల్లో.. అంకెల్లో.. అప్పుల్లో.. దోపిడీలో గత ప్రభుత్వాన్ని కాంగ్రెస్‌ మించిపోయింది. 6 గ్యారంటీలపై ఆశలు వదులుకునేలా బడ్జెట్ తీరు ఉంది' అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి  బండి సంజయ్ కుమార్ తెలిపారు. 'కేటాయింపులకు.. ఆచరణకు పొంతనే లేని బడ్జెట్. మేనిఫెస్టోలోని 10 శాతం హామీలను కూడా అమలు చేయలేని అసమర్ధ సర్కారని తేలిపోయింది. విద్య, వైద్య రంగాల కేటాయింపులు దారుణం' అని విమర్శలు చేశారు.

Add Zee News as a Preferred Source

Also Read: K Kavitha: 'బడ్జెట్‌లో ప్రవచనాలు ఎక్కువ.. పైసలు తక్కువ': ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

అసెంబ్లీ సమావేశాల్లో మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన తెలంగాణ బడ్జెట్‌పై కేంద్ర మంత్రి బండి సంజయ్‌ స్పందించారు. 'అభయ హస్తం కాదు మహిళల పాలిట శూన్య హస్తమని బడ్జెట్ నిరూపించింది. 2 లక్షల ఉద్యోగాల భర్తీ, రూ.4 వేల నిరుద్యోగ భృతి ఊసేలేదు. వృద్దుల పెన్షన్ పెంపును బడ్జెట్‌ గాలికొదిలేసింది' అని వివరించారు. విద్యార్థుల భవిష్యత్తును చిదిమే బడ్జెట్ ఇది అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రైతుకిచ్చిన హామీలన్నీ హుష్ కాకి అని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ఎద్దేవా చేశారు.

Also Read: KT Rama Rao: 'పేదల కష్టాలు తీర్చేది కాదు.. ఢిల్లికి మూటలు పంపే బడ్జెట్ ఇది'

'గోబెల్స్‌ను మించిన అబద్దాల కోరులు కాంగ్రెస్ నాయకులు. ఇచ్చిన హామీలను నెలబెట్టుకునే మోదీ సర్కార్‌తో గోబెల్స్‌ను మించి అబద్దాలు కోరు కాంగ్రెస్ పార్టీకి పోలికా?' అని బండి సంజయ్‌ ప్రశ్నించారు. మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను పరిశీలిస్తే డొల్ల అని తేలిపోయిందని చెప్పారు. గత బడ్జెట్ కేటాయింపులు.. ఖర్చులను పరిశీలిస్తే పొంతనే లేదని తేలిపోయిందని చెప్పారు. అయినప్పటికీ బడ్జెట్ కేటాయింపులు పెంచి తెలంగాణ ప్రజలను దారుణంగా మోసం చేసేందుకు బడ్జెట్‌ను సాధనంగా ఉపయోగించుకోవడం సిగ్గు చేటు అని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ మండిపడ్డారు. 'పది సార్లు చెబితే అబద్దమే నిజమైతుందనే నానుడిని బడ్జెట్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తావించింది. అదే ఒరవడిని కొనసాగించడం సిగ్గు చేటు' అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

'ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకు.. ఆచరణకు ఏమాత్రం పొంతన లేని బడ్జెట్ ఇది. 6 గ్యారంటీలను పూర్తిగా తుంగలో తొక్కేశారు. ఎన్నికలకు ముందు మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా పేర్కొన్న కాంగ్రెస్ నాయకులు అధికారంలోకి వచ్చాక చిత్తుకాగితంగా మార్చినట్లు ఈ బడ్జెట్ ద్వారా వెల్లడైంది. మొత్తంగా బడ్జెట్ తీరును విశ్లేషిస్తే, అబద్దాలు,అంకెల గారడీ 6 గ్యారంటీలకు పాతరేసేలా రాష్ట్ర బడ్జెట్ ఉంది' అని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ విమర్శలు చేశారు.

'ఓం భూం బుష్ అంటూ మాయ చేసేందుకే ప్రయత్నిస్తున్నట్లు స్పష్టంగా కన్పిస్తోంది. తెలంగాణ ప్రజల తలసరి ఆదాయం భారీగా పెరిగినట్లు బడ్జెట్‌లో గొప్పలు చెప్పిన ప్రభుత్వం. అప్పుల వివరాలను కూడా బడ్జెట్ లో పొందుపరిచి ఒక్కో తెలంగాణ పౌరుడిపైనా, చివరకు పుట్టబోయే బిడ్డపైనా ఎంత అప్పు భారం ఉందో వాస్తవాలను వివరిస్తే బాగుండేది' అని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పేర్కొన్న హామీలను పూర్తిగా గాలికొదిలేసినట్లు ఈ బడ్జెట్‌తో తేటతెల్లమైందని చెప్పారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News