Teenmar Mallanna: కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న సస్పెండ్.. భారీ ఝలక్ ఇచ్చిన మీనాక్షి నటరాజన్..!..

Tpcc suspended mlc teenmar mallanna: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకుంది. ఈ క్రమంలో తెలంగాణ రాజకీయాల్ల ఒక్కసారిగా ఈ ఘటన హాట్ టాపిక్ గా మారింది.

Written by - Inamdar Paresh | Last Updated : Mar 1, 2025, 02:16 PM IST
  • తీన్మార్ మల్లన్నకు ఝలక్..
  • సస్పెండ్ చేసిన టీపీసీసీ..
Teenmar Mallanna: కాంగ్రెస్ నుంచి  తీన్మార్ మల్లన్న సస్పెండ్.. భారీ ఝలక్ ఇచ్చిన మీనాక్షి నటరాజన్..!..

Mlc teenmar mallanna suspended from congress: తెలంగాణలో ఇటీవల కాంగ్రెస్ పార్టీ జనగణన కార్యక్రమంను ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. దీనిపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వివాదస్పదంగా మాట్లాడారు. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ను ధిక్కరించే విధంగా, పార్టీ పరువును బజారున పడేసే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. దీనిపై తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 12 లోపు వివరణ ఇవ్వాలని చెప్పింది. కానీ ఆయన దీనిపై స్పందింలేదు. 

Add Zee News as a Preferred Source

ఈ క్రమంలో తాజాగా.. టీపీసీసీ డిసిప్లినరీ కమిటీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు ఊహించని బిగ్ షాక్ ఇచ్చింది. గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలను సీరియస్ గా పరిగణించి.. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు టీపీసీసీ ఆదేశాలు జారీ చేసింది. కులగణనపై వ్యాఖ్యలు చేయడం, కులగణను కాగితాలను కాల్చివేయడం,   ఒక వర్గంపై వివాదాస్పంగా మాట్లాడటంపై కాంగ్రెస్ సీరియస్ అయ్యింది. దీనిపై కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాల మేరకు చర్యలు తీసుకున్నట్లు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.

ఇదిలా ఉండగా.. ఇటీవల కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణకు ఇన్ చార్జీగా మీనాక్షి నటరాజన్ ను నియమించింది.  మీనాక్షి నటరాజన్ నిన్న హైదరబాద్ చేరుకున్నారు. గాంధీభవన్ లో ముఖ్యనేతలతో సమావేశం అయ్యారు.

ఆమె బాధ్యతలు తీసుకున్న 24 గంటల వ్యవధిలోనే.. తీన్మార్ మల్లన్నపై సస్పెండ్ వేటు పడటం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.  మరోవైపు బీసీ కులగణనపై తీన్మార్ ను సస్పెండ్ చేసిన తర్వాత తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందింంచారు. పార్టీ లైన్ దాటితే.. ఎవరిపైన అయిన చర్యలు ఉంటాయని కూడా పీసీసీ చీఫ్ స్పష్టం చేశారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News