tpcc chief reacts on teenmar mallanna suspension issue: కాంగ్రెస్ పార్టీ ఇటీవల తెలంగాణలో కులగణన కార్యక్రమంను ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సూచనల మేరకు తెలంగాణలో రేవంత్ సర్కారు కులగణను నిర్వహించింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కులగణపై వివాదాస్పదంగా మాట్లాడారు. ముఖ్యంగా బీసీ కులగణనలో అనేక తప్పుల తడకగాఉందని అన్నారు.
అంతే కాకుండా.. రెడ్డిల మీద కూడా వివాదాస్పదంగా మాట్లాడారు. తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు మొత్తంగా ప్రభుత్వం చేపట్టిన కులగణనకు చెడ్డపేరు తీసుకొచ్చేలా ఉండటంతో పాటు.. పార్టీ హైకమాండ్ ను ధిక్కరించే విధంగా ఉన్నాయి. దీనిపై కాంగ్రెస్ అధినాయకత్వం సీరియస్ అయ్యింది. ఈ క్రమంలో కులగణనపై ఆయన చేసిన వాఖ్యలపై వివరణ ఇవ్వాల్సిందిగా టీపీసీసీ గతంలో షోకాజ్ నోటీసులు సైతం జారీ చేసింది.
దీనిపై తీన్మార్ మల్లన్న ఇప్పటి వరకు స్పందించలేదు.ఈ క్రమంలో టీపీసీసీ తాజాగా.. తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేస్తు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో తెలంగాణ ఈ అంశం రాజకీయాల్లో ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు తీన్మార్ మల్లన్న సస్పెన్షన్ అంశంపై.. టీసీసీచీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. పార్టీ లైన్ దాటితే ఎవర్ని కూడా వదిలేది లేదని తెల్చి చెప్పారు. పార్టీ మాత్రమే సుప్రీం అని.. దాని ఆదేశాల మేరకు మాత్రమే.. అందరు నడుచుకొవాలంటూ కూడా టీసీసీ చీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
పార్టీ క్రమశిక్షణ ముందు కులమతాల ప్రస్తావన ఉండదని స్పష్టం చేశారు. మల్లన్నకు గతంలో కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా సహకరించిందనే విషయంను గుర్తు చేశారు. అయినా ఆయన పార్టీ లైన్ దాటి మాట్లాడారన్నారు. కులగణన ప్రతుల్ని కాల్చడం, రెడ్డీలను అగౌరవ పర్చేలా మాట్లాడటం విషయంలో ఏఐసీసీ నిర్ణయం తీసుకుందని.. రాహుల్ ఆదేశాలతోనే తీన్మార్ మల్లన్న సస్పెన్షన్ అయ్యారన్నారు.
Read more: Teenmar Mallanna: కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న సస్పెండ్.. భారీ ఝలక్ ఇచ్చిన మీనాక్షి నటరాజన్..!..
పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించేవారికి ఇదో హెచ్చరిక అని, భవిష్యత్‌లో ఎవరైనా పార్టీలైన్ దాటితే చర్యలు తప్పవని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తెల్చి చెప్పారు. మరోవైపు.. తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్‌గా మీనాక్షి నటరాజన్ బాధ్యతలు తీసుకున్న కొన్ని గంటల్లోనే మల్లన్నపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. పార్టీ నిబంధనలు దాటితే.. ఎవరికైన ఇదే పరిస్థితి ఏర్పడుతుందని పార్టీ డైరెక్ట్ గా సంకేతాలు పంపిందని కాంగ్రెస్ వర్గాల్లో రచ్చ మొదలైంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









