Gas Cylinder Blast: వేసవి రాకముందే తెలంగాణలో అగ్ని ప్రమాదాలు తీవ్రమవుతున్నాయి. హైదరాబాద్‌లో అనూహ్యంగా సంభవించిన ప్రమాదంలో మంటల్లో చిక్కుకుని ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఓ వృద్ధురాలు.. చిన్నారి.. ఓ మహిళ ఉన్నారు. మృతులందరూ మహిళలు కావడం కలచివేసే అంశం. ప్రమాదం సంభవించిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగిన వారిని కాపాడలేకపోయారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: SLBC Tunnel Tragedy: విషాదంగా ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదం.. 8 మంది కార్మికులు మృతి
హైదరాబాద్ మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని పాషా కాలనీలోని ఓ భవనంలో కిరాణా దుకాణం నిర్వహిస్తున్నారు. దుకాణం వెంట ఒక ఫ్లాట్‌తోపాటు రెండంతస్తుల్లో మరికొన్ని ఇల్లు ఉన్నాయి. అయితే శుక్రవారం దుకాణంలో అగ్నిప్రమాదం సంబంధించింది. వెంటనే స్థానికులు, భవనంలోని వారు దిగి సహాయ చర్యలు చేపట్టారు. మంటలు తీవ్రంగా వ్యాపించడంతో వెంటనే అగ్నిమాపక సిబ్బంది, స్థానిక పోలీసులు వచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు.
Also Read: Husband Suicide: భార్య వేధింపులతో మరో భర్త ఆత్మహత్య.. 'భర్తల చట్టం రావాలి' అని విజ్ఞప్తి
అయితే భవనంలో ఉన్న ఇతర ఫ్లాట్‌లలోని వారు భవనంపైకి చేరుకుని ప్రాణాలతో బయటపడ్డారు. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది తాడు సహాయంతో వారిని కిందకు దించి కాపాడారు. అయితే మూడు సిలిండర్లు పేలడంతో ఈ ప్రమాదం సంభవించిందని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. మంటల్లో చిక్కుకున్న సీజీరా ఖాతున్ (7) జమీలా ఖతున్ (70), సహనా ఖాతూన్ (40) ఊపిరి పిల్చుకోలేక మృతి చెందినట్టు డీసీపీ వెల్లడించారు. ప్రమాదంలో 5 మంది సురక్షితంగా కాపాడినట్లు తెలిపారు.
మంటల్లో గాయపడిన వారిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించినట్లు.. వారు చికిత్స పొందుతున్నట్లు డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. అగ్ని ప్రమాదానికి షార్టీ సర్క్యూట్ కారణం ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. అగ్నిమాపక సిబ్బందితో మంటలను పూర్తిగా అదుపులో తీసుకొచ్చారు. ఈ ప్రమాదంతో స్థానికంగా తీవ్ర భయానక వాతావరణం ఏర్పడింది. దట్టమైన పొగలు అలుముకోవడంతో స్థానికులు భయాందోళన చెందారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









