Cigarette Death: 'మద్యం, సిగరెట్‌ ప్రాణాంతకం అన్నట్టే నిజమైంది.. నిద్రలోనే టీచర్‌ మృతి'

Smoking And Alcohol Really Injurious Burning Cigarette Teacher Death: భార్య పుట్టింటికి వెళ్లడంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు మద్యం సేవించి ఆ మైకంలోనే సిగరెట్‌ వెలిగించి ఆ మంటల్లోనే అతడు సజీవ దహనమైన సంఘటన సంచలనం సృష్టిస్తోంది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Apr 7, 2025, 03:30 PM IST
Cigarette Death: 'మద్యం, సిగరెట్‌ ప్రాణాంతకం అన్నట్టే నిజమైంది.. నిద్రలోనే టీచర్‌ మృతి'

Shocking Cigarette Death: పిల్లలతో కలిసి భార్య పుట్టింటికి వెళ్లడంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు మద్యం తెచ్చుకుని తాగుతున్నాడు. మద్యం సేవిస్తూ సిగరెట్‌ కూడా తాగుతున్నాడు. ఇక మద్యం బాగా తాగిన అనంతరం సిగరెట్‌ వెలిగించుకున్నాడు. అయితే మత్తులో తాగలేక పడుకున్న మంచంపై ఉంచాడు. అయితే సిగరెట్‌ నిప్పు క్రమంగా మంచానికి అంటుకుంది. ఆ పక్కనే కూలర్‌ ఉండడంతో ఆ గాలికి ఆ నిప్పు మంటగా మారింది. మద్యం మత్తులో ఉన్న ఉపాధ్యాయుడు స్పృహలో లేకపోయాడు. దీంతో ఆ మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యాడు. ఈ సంచలన సంఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. సూర్యాపేట జిల్లా కోదాడలో జరిగిన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

Add Zee News as a Preferred Source

Also Read: Employees Holiday: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. 'శృంగారం' కోసం 36 గంటల పాటు సెలవు

సూర్యాపేట జిల్లా కోదాడ మండలం మంగళతండాకు చెందిన ధారావత్ బాలాజీ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. అతడికి భార్య శైలజ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. నడిగూడెం మండలం చెన్నకేశవపురంలోని ప్రభుత్వ పాఠశాలలో ఎస్జీటీ ఉపాధ్యాయుడుగా పని చేస్తుండేవాడు. అతడికి మద్యం అలవాటు ఉంది. శ్రీరామనవమిని పురస్కరించుకుని ఆదివారం భార్య తన ఇద్దరు పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్లింది. అక్కడ పండుగ ఆనందంలో భార్యాపిల్లలు ఉండగా.. ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలాజీ మద్యం తెచ్చుకున్నాడు.

Also Read: House Rent High: బాత్రూమ్‌ను ఇల్లుగా మార్చుకున్న యువతి.. లోపలికి వెళ్లి చూస్తే..!

ఇంట్లో ఆవరణలో నవారు మంచం వేసుకుని మద్యం తాగుతూ ఉన్నాడు. అనంతరం మంచంపై పడుకొని సిగరెట్ వెలిగించాడు. సిగరెట్‌ వెలిగించిన అనంతరం మద్యం మత్తులో నిద్రలోకి జారుకున్నాడు. ఆ సిగరెట్‌ ప్రమాదవశాత్తు మంచం నవారుపై పడి నిప్పు ఎక్కువైంది. దీనికి కూలర్ గాలి తోడవడంతో ఆ నిప్పు కాస్త మంటలుగా చెలరేగాయి. మద్యం మత్తులో ఉన్న బాలాజీ దీనిని గుర్తించలేకపోయాడు. మద్యం మత్తులో గాఢనిద్రలోకి వెళ్లిన బాలాజీ సిగరెట్‌ మంటల్లో చిక్కుకుని మంచంపైనే సజీవ దహనమయ్యారు.

చుట్టుపక్కల ఎవరూ లేకపోవడం, ప్రమాద నుంచి తప్పించుకునే స్థితిలో బాలాజీ లేకపోవడంతో శరీరానికి మంటలు అంటుకొని మృతి చెందాడు. సోమవారం ఉదయం తండావాసులు చూసి విస్తుపోయి వెంటనే కుటుంబసభ్యులతోపాటు పోలీసులకు సమాచారం అందించారు. కోదాడ ప్రభుత్వంలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. భార్య శైలజ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ  అనిల్ రెడ్డి వివరించారు. ఈ సంఘటన సంచలనం రేపుతోంది. మద్యపానం, ధూమపానం ఎంత ప్రమాదకరమో ఈ సంఘటన ప్రత్యక్ష ఉదాహరణగా పేర్కొంటున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News