Kamareddy 3 Children Drowned: ఉగాది పండుగ వేళ తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. ఎల్లారెడ్డి మండలం వెంకటాపూర్ చెరువులో పడి తల్లితో పాటు ముగ్గురు పిల్లలు మృతి చెందారు. చెరువుల స్నానానికి దిగి మునిగిన ముగ్గురు పిల్లలను కాపాడేందుకు ప్రయత్నించింది తల్లి. ఆమెతోపాటు ముగ్గురు పిల్లలు కూడా మునిగిపోయారు. ఈ ఘటనలో వారంతా ప్రాణాలు కోల్పోయారు. మృతులు మౌనిక (26), మైథిలి (10), అక్షర (8) వినయ్ (5) గుర్తించారు అలుముకున్నాయి.
కామారెడ్డి అగ్రహారం గ్రామంలో పండగ పూట ఈ విషాదం చోటుచేసుకుంది. ఊరు చివరలో ఉన్న చెరువులోకి స్నానాలు చేసి బట్టలు ఉతుక్కుని రావడానికి వెళ్లారు. కానీ పండగ పూట వెళ్లిన వారికి విషాద ఘటన ఎదురైంది. ఎల్లారెడ్డి మండలంలో వెంకటాపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు మునిగిపోవడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. దీంతో ఆ కుటుంబంతోపాటు గ్రామమంతా విషాదఛాయలు అలుముకున్నాయి .
అయితే స్థానికులు వివరాల ప్రకారం.. మౌనిక పిల్లలతో పాటు చెరువు వద్దకు బట్టలు ఉతకడానికి వెళ్లింది. అక్కడ ప్రమాదవశాత్తు పిల్లలు నీళ్లలో పడిపోయారు. దీంతో వారిని తీసేందుకు వెళ్లిన మౌనిక కూడా మునిగిపోయింది. విషయం తెలిసిన వెంటనే గ్రామస్తులు సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు. ఘటనానికి స్థలానికి వెంటనే చేరుకున్న బృందాలు, పోలీసులు వారి మృతదేహాలను బయటకు తీయడానికి తీవ్ర కృషి చేస్తున్నారు. అయితే, ఇప్పటివరకు పిల్లల మృతదేహాలను బయటకు తీశారు. కానీ ఇంకా మౌనిక మృతదేహం బయటికి తీయలేదు. ఇంకా గాలింపు చర్యలు చేపడుతున్నారు.
ఇదీ చదవండి: SRH: అలా చేస్తే హైదరాబాద్ వదిలి వెళ్లిపోతాం: SRH సంచలన వ్యాఖ్యలు..
అల్లుడే చంపాడు..
ఇదిలా ఉండగా మౌనిక ముగ్గురు పిల్లలది హత్య అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు మైథిలి, అక్షరాల అమ్మమ్మ, తాతయ్యలు. గతంలో కూడా తన కూతుర్ని అల్లుడే హత్య చేశాడని అయితే అప్పుడు తమకు న్యాయం జరగలేదన్నారు. ఆ తర్వాత మౌనికను రెండో వివాహం చేసుకున్నాడని వారిద్దరికీ వినయ్ జన్మించాడని చెబుతున్నారు. హాస్టల్లో ఉన్న పిల్లలు రెండు రోజుల క్రితమే ఊరికి తీసుకువచ్చాడని ఆ తర్వాత చెరువు వద్ద బట్టలు ఉతకడం వంటి డ్రామాలు చేస్తున్నాడు. అల్లుడే చంపేసి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు తమ అల్లుడి పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. అనుమానితుడిని కూడా అదుపులోకి తీసుకొని వివరాలు రాబడుతున్నారు పోలీసులు.
ఇటీవల అమీన్ పూర్‌లో కూడా ఓ తల్లి ముగ్గురు పిల్లలకు అన్నంలో విషం పెట్టి చంపిందని చెబుతున్నారు. కుటుంబ సభ్యులు మాత్రం తండ్రిపై అనుమానం వ్యక్తం చేశారు. మరో తల్లి మూడు నెలల పసికందును నీటి బకెట్లో వేసి చంపేసింది. దీనికి ఆర్థిక పరిస్థితులే కారణమని చెప్పుకోచ్చారు. భర్తకి కిడ్నీలు పాడవడంతో డయాలసిస్ చేయాల్సి వస్తుంది. మరోవైపు చిన్న పిల్ల భారం కూడా పడడంతో ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని తెలుస్తోంది.
ఇదీ చదవండి: ప్రపంచంలోనే అతిపెద్ద భూకంపం ఎక్కడ సంభవిస్తుంది? దాని వినాశనం ఎలా ఉంటుంది తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









