close

News WrapGet Handpicked Stories from our editors directly to your mailbox

సీఎం కేసీఆర్ నియోజకవర్గంలో రైలు బండి

                                              

Updated: Feb 28, 2019, 07:23 PM IST
సీఎం కేసీఆర్ నియోజకవర్గంలో రైలు బండి

గజ్వేల్‌  నియోజకవర్గం అభివద్దిపై ప్రత్యేక సారించిన కేసీఆర్..దక్షిణ రైల్వే అధికారులతో మాట్లడి తన నియోజకవర్గంలో రైల్వే లైన్ ఏర్పాటు చేసుకున్నారు. జూలై మొదటి వారంలోగా గజ్వేల్ నియోజకవర్గ ప్రజలకు రైలు ప్రయాణం అందుబాటులోకి తీసుకువస్తామని రైల్వేశాఖ ప్రకటించింది. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరువతో జరుగుతున్న రైల్వేట్రాక్ నిర్మాణ పనులు మరో రెండునెలల్లో పూర్తి చేయాచేసి.. జూన్ చివరిలోగా  రైలు ప్రయాణానికి అవసరమైన అన్నిఏర్పాట్లు  పూర్తి   రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుంది.

గజ్వేల్ రైలు సౌకర్యంపై రైల్వేశాఖ కన్‌స్ట్రక్షన్ విభాగం డిప్యూటీ చీఫ్ ఇంజినీర్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ గజ్వేల్ మండలం గిరిపల్లి వద్ద రైల్వే బ్రిడ్జి, ట్రాన్ నిర్మాణ పనులను పరిశీలించి అధికారులు, కంట్రాక్టర్లకు పలు సూచనలు చేసినట్లు తెలిపారు.  మనోహరాబాద్-గజ్వేల్ మధ్య రైల్వే ట్రాక్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. రెవెన్యూ అధికారులు భూసేకరణ పూర్తి చేయడంతో ఇబ్బందులు తొలిగిపోయి నిర్మాణ పనుల్లో వేగం పుంజుకున్నట్లు తెలిపారు.