)
Bandi Bagirath POCSO Case: మద్యం తాగించి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడనే ఆరోపణలపై కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ సాయిపై పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో పోక్సో కేసు నమోదడంతో తెలంగాణతోపాటు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. ఈ వ్యవహారంపై జాతీయ స్థాయిలో రచ్చ మొదలవగా.. బీఆర్ఎస్ పార్టీతోపాటు కాంగ్రెస్ తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేసింది. తెలంగాణలో తీవ్ర రాజకీయ దుమారం రేపిన ఈ సంఘటనపై తొలిసారి నిందితుడి తండ్రి, కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ స్పందించారు. తనకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు.
తన కుమారుడు బండి భగీరథ్ సాయిపై నమోదైన పోక్సో కేసుపై కేంద్ర సహాయ మంత్రి, కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ 'ఎక్స్' వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా తన ఎదుగుదలను ఓర్వలేక.. రాజకీయంగా ఎదుర్కోలేక తన కుటుంబసభ్యులను రాజకీయాల్లోకి లాగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను కష్టపడి కేంద్ర మంత్రి స్థాయి వరకు ఎదిగిన సామాన్య బీసీ వ్యక్తినని గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా తన కుమారుడిపై ఆరోపణలు చేస్తున్న వారిపై సమాధానం వస్తుందని.. ప్రతి కుట్ర బహిర్గతం అవుతుందని బండి సంజయ్ విశ్వాసం వ్యక్తం చేశారు.
నిరాధారమైన ఆరోపణలు వెలుగు చూసిన నేపథ్యంలో ఈ ప్రకటన చేస్తున్నట్లు బండి సంజయ్ తెలిపారు. 'నాకు చట్టంపై గౌరవం, న్యాయ వ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉంది. జీవితాంతం భారత రాజ్యాంగానికి కట్టుబడే ఉన్నా. దశాబ్దాలుగా ప్రజలతోనే ఉన్న నేను మచ్చ లేని జీవితం గడిపానని గర్వంగా చెప్పగలను' అని పేర్కొన్నారు. 'నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక కొందరు నా పిల్లలను, కుటుంబసభ్యులను రాజకీయాల్లోకి లాగుతున్నారు. ఇది వారిలో గూడుకట్టుకున్న నిరాశ నిస్పృహలకు అద్దం పడుతుంది. అట్టడుగు స్థాయి నుంచే నా ప్రజా జీవితాన్ని మొదలుపెట్టా. కష్టపడి పనిచేసి ప్రజల ఆశీర్వాదంతో నాడు కార్పొరేటర్‌గా, నేడు ఎంపీగా ఎన్నికై కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నా. ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వెనకబడి వర్గాలకు చెందిన బీసీ వ్యక్తి, నాయకుడిగా కేంద్రమంత్రి స్థాయికి ఎదగడాన్ని కొన్ని శక్తులు జీర్ణించుకోలేక కుట్రలకు తెరతీశాయి' అని ఆరోపించారు.
'రేపు ప్రధానమంత్రి బహిరంగ సభ నేపథ్యంలో నన్ను వ్యక్తిగతంగా అప్రతిష్టపాలు చేయాలన్నదే ఆ కుట్రల వెనకున్న అసలు లక్ష్యం. తప్పేదో.. ఒప్పేదో.. న్యాయవ్యవస్థ నిర్ణయిస్తుందన్న నమ్మకం నాకుంది. సమయం ప్రతి ఆరోపణకు సమాధానం ఇస్తుంది. ప్రతి కుట్రను బహిర్గతం చేస్తుంది' అని బండి సంజయ్ పేర్కొన్నారు. చివరికి సత్యమేవ జయతే అని పోస్టు చేశారు.
నిరాధారమైన ఆరోపణలు వెలుగు చూసిన నేపథ్యంలో ఈ ప్రకటన
నాకు చట్టంపై గౌరవం, న్యాయ వ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉంది. జీవితాంతం భారత రాజ్యాంగానికి కట్టుబడే ఉన్నాను. దశాబ్దాలుగా ప్రజలతోనే ఉన్న నేను మచ్చ లేని జీవితం గడిపానని గర్వంగా చెప్పగలను.
నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక కొందరు నా…
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) May 9, 2026
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి