Operation Kagar: మావోయిస్టుల 'ఆపరేషన్‌ కగార్‌'పై బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు

Bandi Sanjay Sensational Comments On Operation Kagar: మావోయిస్టుల ఏరివేత కోసం చేపట్టిన ఆపరేషన్‌ కగార్‌పై కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. వారితో చర్చలు ఉండవని.. చర్చల ఊసే ఉండదని ప్రకటించారు. ఎందరినో మావోయిస్టులు పొట్టనబెట్టుకున్నారని విమర్శించారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : May 4, 2025, 01:05 PM IST
Operation Kagar: మావోయిస్టుల 'ఆపరేషన్‌ కగార్‌'పై బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు

Operation Kagar: దేశంలో మావోయిస్టుల ఏరివేత ముమ్మరంగా సాగుతుండగా పౌర సమాజం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్‌ కగార్‌ను నిలిపివేయాలని డిమాండ్‌ తీవ్రమవుతున్న వేళ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. వారితో మాటలు లేవు.. మాట్లాడుకోవడం లేవు అని ప్రకటించారు. మావోయిస్టులతో చర్చల ఊసే ఉండదని స్పష్టం చేశారు.

Add Zee News as a Preferred Source

Also Read: ZEE News Network: జీ తెలుగు న్యూస్ ఆధ్వర్యంలో తెలంగాణ పోలీస్ రియల్ హీరోస్ జీ అవార్డ్స్ - 2025..

బీఆర్ఎస్‌ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ 'ఆపరేషన్‌ కగార్‌'పై స్పందించిన తర్వాత తెలంగాణతోపాటు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కరీంనగర్‌లోని కొత్తపల్లిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ స్పందిస్తూ ఆపరేషన్‌ కగార్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టులతో చర్చల ప్రసక్తే లేదని ప్రకటించారు. తుపాకీ చేతపట్టి అమాయకులను పొట్టనపెట్టుకున్నోళ్లతో చర్చలు ఉండవని స్పష్టం చేశారు. మావోయిస్టులను నిషేధించిందే కాంగ్రెస్ పార్టీ అని బండి సంజయ్‌ గుర్తుచేశారు.

Also Read: Big Shock RTC Workers: ఆర్టీసీ కార్మికులకు రేవంత్‌ రెడ్డి భారీ షాక్‌.. 'ఆర్థిక పరిస్థితి బాగాలేదు'

'కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ సహా ఎంతోమంది నాయకులను నక్సల్స్‌ మందుపాతరలు పెట్టి చంపారు. అమాయక గిరిజనులను ఇన్‌ఫార్మర్ల నెపంతో అన్యాయంగా కాల్చి చంపి ఎన్నో కుటుంబాలకు మావోయిస్టులు మానసిక క్షోభ మిగిల్చారు' అని కేంద్ర మంత్రి బండి సజయ్‌ తెలిపారు. తుపాకీ వీడనంత వరకు మావోయిస్టులతో చర్చల ఊసే ఉండదని స్పష్టం చేశారు. కేంద్ర కులగణన నిర్ణయం చారిత్రాత్మకమని.. ఇది కాంగ్రెస్ విజయమని చెప్పడం విడ్డూరంగా పేర్కొన్నారు.

కాంగ్రెస్ కులగణన సర్వేకు.. మోదీ కులగణనకు పొంతనే ఉండదని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ తెలిపారు. కాంగ్రెస్ కులగణనతో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని.. బీసీల జనాభాను తగ్గించి చూపారని విమర్శించారు. కాంగ్రెస్ మాయమాటలను జనం నమ్మడం లేదని.. 6 గ్యారంటీల అమలులో వైఫల్యాన్ని పక్కదోవ పట్టించేందుకే కాంగ్రెస్ డ్రామాలాడుతోందని చెప్పారు. రోహింగ్యాలపై కాంగ్రెస్ వైఖరి ఏమిటో చెప్పాలని సవాల్ చేశారు. శాంతి భద్రతల సమస్యను రాజకీయం చేయడం సరికాదని బండి సంజయ్‌ హితవు పలికారు. కాళేశ్వరంపై ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చినా చర్యలెందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మావోయిస్టులతో చర్చలు జరపాలని పోటీలు పడుతున్నారు. కానీ నక్సల్స్ తో మాటల్లేవు... మాట్లాడుకోవడాల్లేవ్' అని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ తెలిపారు.

కేంద్ర మంత్రి బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. బీఆర్‌ఎస్‌ పార్టీ, కాంగ్రెస్‌ ఆపరేషన్‌ కగారు నిలిపివేయాలని డిమాండ్‌ చేస్తుండగా రాజకీయ దుమారం రేపుతోంది. ఆపరేషన్‌ కగార్‌ నిలిపేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి గులాబీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ త్వరలో లేఖ రాయనున్నట్టు తెలుస్తోంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News