Union Minister Bandi Sanjay warning to Hyderabad police over borabanda jubilee hills bypolls: తెలంగాణలో జూబ్లిహిల్స్ బై పోల్ ఎన్నికల ప్రచారం మరో నాలుగు రోజుల్లో ముగియనుంది. ఈ క్రమంలో అన్ని రాజకీయ పార్టీలు సైతం ప్రచారం స్పీడ్ ను పెంచాయి. ఎన్నికలు సమీపిస్తున్న కొలది నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ రోజు సాయంత్రం కేంద్ర మంత్రి బండి సంజయ్ బొరబండలో ఎన్నికల ప్రచారంను నిర్వహించడానికి పోలీసుల నుంచి పర్మిషన్ తీసుకున్నారు . దీనికి తొలుత ఓకె చెప్పిన పోలీసులు ఆతర్వాత అనూహ్యంగా అనుమతి నిరాకరించారు. దీనిపై పెద్ద దుమారం రాజుకుంది.
తాజాగా. కేంద్ర మంత్రి బండి సంజయ్ పోలీసులపై సీరియస్ అయ్యారు. బోరబండకు తాను వస్తున్నానని, ఎవరు అడ్డుకుంటారో చూస్తానంటూ పోలీసులకు సవాల్ విసిరారు. ఇట్లాంటి అడ్డంకులు బీజేపీ ఎన్నో ఎదుర్కొని పోరాడిందని సీఎం రేవంత్ సర్కారును ఏకీపారేశారు. బీజేపీ కార్యకర్తలారా, ప్రజలారా సాయంత్రం బొరబండకు తరలిరావాలని పిలుపునిచ్చారు.
మరోవైపు.. బీజేపీ దమ్మేందో చూపిద్దామన్నారు. కాంగ్రెస్ కుట్రలు చేస్తుందని, ఈసీ అనుమతి ఇచ్చినా పోలీసులు అనుమతి ఇవ్వకపోవడమేందని తీవ్రంగా స్పందించారు. మరోవైపు.. రాష్ట్రంలో దారుస్సలాం పాలన నడుస్తోందా?.. పోలీసులు ఎంఐఎంకు తొత్తులుగా మారారా?.. అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
Read more: Sangareddy: తెలంగాణలో షాకింగ్ ఘటన.. చీమలంటే భయంతో మహిళ ఏంచేసిందో తెలుసా..?..
బోరబండలో బీజేపీ తడాఖా ఏందో చూపిద్దామన్నారు. బీజేపీ శ్రేణులు, కార్యకర్తలు బోరబండకు భారీగా తరలిరవాలని పిలుపునిచ్చారు. అదే విధంగా.. మజ్లిస్ సంగతేందో, పోలీసుల సంగతేందో తేల్చుకుందామని కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో బోరబండ పరిధిలొ హైటెన్షన్ ఏర్పడింది. పోలీసులు ముందు జాగ్రత్తగా భారీగా బలగాలను మోహరించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook









