)
VHP Leader: తెలంగాణలో ముష్కర మూకలు రెచ్చిపోతున్నాయి. హిందూ సంఘాలకు సంబంధించిన కీలక నేతలను టార్గెట్ చేస్తూ రెచ్చిపోతున్నారు. అంతేకాదు వారిపై దాడులతో పోలీసులకు సవాల్ విసుతున్నారు. తాజాగా తెలంగాణ విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ రావినూతల శశిధర్ ఇంటిపై దుండగులు దాడి చేయడం కలకలం రేపింది.
గతంలో పలు సార్లు శశిధర్ ఇంటిపై రెక్కీ నిర్వహించారు అగంతకులు. అంతేకాదు ఓ ప్లాన్ ప్రకారం పకడ్బందీగా రావినూతలను టార్గెట్ చేసినట్టు దాడికి పాల్పడిన ఘటనను చూస్తే తెలుస్తుంది. తన ఇంటిపై కొంత మంది వ్యక్తులు చేసిన దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు శశిధ్.
తాజాగా మరోసారి తెల్లవారు జామున దుండగులు రావినూతల శశిధర్ ఇంటిప దాడికి పాల్పడ్డారు ఆగంతకులు. ఇంటి డోర్లు పగల కొట్టి లోపలికి ప్రవేశించే ప్రయత్నం చేసినట్లు శశిధర్ తెలిపారు. అంతేకాదు జరిగిన ఘటనపై వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తనకు ప్రాణహానీ ఉందని..రాచకొండ కమిషనర్‌ను కలిసి భద్రత కల్పించాలని కోరారు శశిధర్.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe