వసంత పంచమి నేపథ్యంలో బాసరలోని జ్ఞాన సరస్వతీ దేవి ఆలయానికి భక్తులు భారీగా పోటెత్తారు. అర్ధరాత్రి ఒంటి గంటకు అమ్మవారికి మంగళ వాయిద్య, సుప్రభాత సేవలను ఆలయ పండితులు నిర్వహించారు. ముగ్గురు అమ్మవార్లకు అభిషేక పూజలు జరిపించారు అర్చకులు. అనంతరం తెల్లవారు జామున 3 గంటల నుంచి అక్షరాభ్యాసాలు ప్రారంభించారు.
అమ్మవారి దర్శనం కోసం ఏర్పాటు చేసిన క్యూలైన్‌లతోపాటు అక్షరాభ్యాస మండపాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. దేవాలయంలో అమ్మవారి దర్శనానికి మూడు గంటలు, అక్షరాభ్యాస పూజకు రెండు గంటల సమయం పడుతోంది.మరోవైపు బాసరలో వసంత పంచమి ఉత్సవాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఇవి ఈ రోజుతో ముగియనున్నాయి.
Read more: సమంత కంటే ముందు రెండో పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీళ్లే..! పూర్తి లిస్ట్ ఇదే..!
Read more: సమంత బాటలో దర్శకులను పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీళ్లే..
బాసర క్షేత్రంలో ఉత్సవాల ప్రారంభం నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. వసంత పంచమి వేళ..తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచీ భారీగా భక్తులు తరలివస్తున్నారు. దాంతో భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా.. ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
Also Read: వెయ్యి కోట్ల దర్శకులు.. ‘దురంధర్’తో ఈ క్లబ్బులో ఎంట్రీ ఇచ్చిన ఆదిత్యధర్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









