)
VC Sajjanar travelled in bus video viral: తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల భారీగా ఐఏఎస్ లు, ఐపీఎస్ ల బదిలీలు జరిగిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో టీజీఎస్ ఆర్టీసీ ఎండీగా ఉన్న సజ్జనార్ ను హైదరాబాద్ సీపీగా రేవంత్ రెడ్డిప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎండీగా తన చివరి వర్కింగ్ డే రోజున వీసీ సజ్జనార్. బస్సులో టికెట్ కొని మరీ ప్రయాణం చేశారు.
ఆర్టీసీ ఎండీగా తన చివరి రోజున RTC బస్సులో కార్యాలయానికి వెళ్లిన @SajjanarVC pic.twitter.com/mtbfwdSWVw
— greatandhra (@greatandhranews) September 29, 2025
ప్రజా రవాణాపై తమకున్న అనుబంధాన్ని వ్యక్తపరుస్తు.. సజ్జనార్ సాధారణ ప్రయాణికుడి మాదిరిగా టెలిఫోన్ భవన్ నుంచి బస్ భవన్ వరకు 113 I/M రూట్ బస్సులో ప్రయాణించారు. అంతే కాకుండా బస్సులో మహిళలతో మాట్లాడి.. ముఖ్యంగా మహాలక్ష్మి స్కీమ్ ద్వారా మహిళలు పొందుతున్న ప్రయోజనాల గురించి ఆరా తీశారు.
సజ్జనార్ తో ఫోటోలు దిగేందుకు మహిళలు, ప్రయాణికులు పోటీ పడ్డారు. మొత్తంగా ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ సేవల్ని ప్రజలు, ఆర్టీసీ సిబ్బంది కొనియాడుతున్నారు. మరోవైపు ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ తనదైన మార్క్ చూపించారు. ఆర్టీసీ బ్రాండ్ కోసం.. మన ఆర్టీసీ అంటూ ప్రజల్లో మంచి పేరు తీసుకొని రావడానికి పాటు పడ్డారు.
పండగ పూట ప్రత్యేకంగా బస్సుల్ని ఏర్పాటు చేయడం, ప్రజలకు ఎప్పటి కప్పుడు ఆన్ లైన్ సేవలతో బస్సు సర్వీసుల్ని మరింతగా చేరువ చేయడంతో సజ్జనార్ పాత్రం ఎంతో ఉందని చెప్పుకొవచ్చు. మరోవైపు ఆర్టీసీ సిబ్బందికి కూడా సజ్జనార్ ప్రతి విషయంలో అండగా ఉంటూ, వారి సమస్యల్ని ప్రభుత్వంతో చర్చించడంతో కీలక పాత్ర పోషించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook