Hyderabad: హైదరాబాద్ సంధ్య థియేటర్ లో పాముల కలకలం.. బుసలు కొడుతూ సిబ్బందిపై దాడి.. వీడియో ఇదే..

Cobra in Sandhya Theatre: ఆర్టీసీ క్రాడ్ లోని సంధ్య థియేటర్ లలో పాముల కలకలం వార్తలలో నిలిచింది.  రూ. 50 టికెట్ ఎంట్రీ వద్ద పాములు కన్పించాయి. వెంటనే సిబ్బంది అలర్ట్ అయ్యారు.  స్నేక్ క్యాచర్ కు సమాచారం అందించారు.

Written by - Inamdar Paresh | Last Updated : Jun 11, 2025, 06:51 PM IST
  • సంధ్య థియేటర్ లో పాములు.
  • భయపడిపోయిన సిబ్బంది..
Hyderabad: హైదరాబాద్ సంధ్య థియేటర్ లో పాముల కలకలం.. బుసలు కొడుతూ సిబ్బందిపై దాడి.. వీడియో ఇదే..

Cobra Snakes found in sandhya theatre hyderabad: వానాకాలంలో పాములు బెడద ఎక్కువగా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ నేపథ్యంలో పాములు ముఖ్యంగా ఎక్కడైతే చీకటిగా ఉంటుందో, వెచ్చని ప్రదేశాలు ఉంటాయో అక్కడ నక్కి ఉంటాయి. ముఖ్యంగా పాములు వర్షాకాలంలో జనావాసాల్లోకి ఎక్కువగా వస్తుంటాయి.

Add Zee News as a Preferred Source

ఈ క్రమంలో ప్రస్తుతం పాములు ఏకంగా హైదరాబాద్ లోని నగరం నడిబొడ్డున గల సంధ్య థియేటర్ లలో రావడం పెద్దరచ్చగా మారింది. ఈ నేపథ్యంలో సిబ్బంది ప్రతిరోజులానే థియేటర్లలో తమ విధుల్లో ఉన్నారు.

 

రూపాయలు 50 టికెట్ ఎంట్రీ వద్ద టికెట్ లు తీసుకుని సినిమాకు వస్తున్న వాళ్లను లోనికి వదులుతున్నారు. ఇంతలో అక్కడున్న సిబ్బంది పక్కన ఎదో బుస్ బుస్ మంటూ చప్పుడు వస్తుండటంతో చూశాడు .

ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. అక్కడు రెండు నుండు పాములు కన్పించాయి. వెంటనే యాజామాన్యంకు పాముల గురించి చెప్పారు. దీంతో సిబ్బంది స్నేక్ క్యాచర్ కు సమాచారం అందించారు. ఈ ఘటనతో ఒక్కసారిగా థియేటర్ అంత గందర గోళం ఏర్పడింది. థియేటర్ లలో పాములు ఏమైన వెళ్లాయా.. అని అక్కడున్న సిబ్బంది బ్యాటరీలు, లైట్లు వేసుకుని మరీ చెక్ చేశారు.

Read more: Snake Romance Video: చెట్టు మీద ఏకాంతంగా సయ్యాటలాడుతున్న జంట సర్పాలు.. అరుదైన వీడియో మీ కోసం..

చాలా సేపు థియేటర్ లలో పాములు వెళ్లాయని ఆర్టీసీ క్రాస్ రోడ్ అంతా పుకార్లు వ్యాపించాయి. దీంతో చాలా మంది విద్యార్థులు సంధ్య థియేటర్ లో వెళ్లడానికి ప్రయత్నించారు .దీంతో కాసేపు అక్కడి సిబ్బంది గేట్లను క్లోజ్ చేసి సినిమా థియేటర్ అంతట కూడా  పాముల కోసం సెర్చింగ్ చేశారు. కొన్ని పాముల్ని సైతం స్నేక్ క్యాచర్ లు  పట్టుకున్నారు. ఈ ఘటనకు చెందిన వీడియో వైరల్గా మారింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook 

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News