)
Hyderabad Rains Videos: మూసీ ఉప్పొంగి పొర్లుతోంది. కుండ పోత వర్షాల వల్ల హైదరాబాద్ అంతట అతలాకుతలమవుతుంది. శనివారం రాత్రి మూసీ నది మరింత ప్రమాదకరంగా ప్రవహించడంతో స్థానికంగా అనేక మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇప్పటికే ఛాదర్గట్ బ్రిడ్జి పరివాహక ప్రాంతాలను కూడా క్లోజ్ చేశారు. ఇక హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ గేట్లు ఎత్తివేయడంతో ఈ వరద ఉధృతి మరింత పెరిగింది. ఈ సందర్భంగా మూసీ పరివాహక ప్రాంతంలో వరద మరింత పెరిగిపోయి ప్రమాదకరంగా ప్రవహించింది. ఆ ప్రాంతాల్లో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు ఎన్డీఆర్ఎఫ్, హైడ్రా అధికారులు తరలించారు.
అక్కడి నుంచి దాదాపు 1,000 మంది కుటుంబాలని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మూసి పరివాహక ప్రాంతాలకు ప్రవేశం లేదని కూడా అధికారులు ఆదేశించారు. వారికి సరైన వసతులు కూడా కల్పించారు. ఇప్పటికే రిలీఫ్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేసి లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలించారు. ఎన్నో ఏళ్ల తర్వాత ఇంతలా వరదలు వచ్చాయి. ఎప్పటికప్పుడు అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మిధిలానగర్ కాలనీలో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి.
ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ వరద పరిస్థితులను ఎప్పటికప్పుడు ఆరాతీసి తెలుసుకుంటూనే ఉన్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలి లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చీఫ్ మినిస్టర్ ఆఫీస్ (CMO) ఎప్పుడు అందుబాటులో ఉండాలని చెప్పారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు.
#WATCH | Telangana: After heavy rainfall in Hyderabad, the officials opened the gates of Himayat Sagar reservoir last night, causing Musi River to overflow near Chaderghat bridge.
Police officials closed the road; houses near Musi River flooded. pic.twitter.com/P4KBkoPAVC
— ANI (@ANI) September 27, 2025
అయితే, వరద ఉధృతి వల్ల రవాణా వ్యవస్థ కూడా తీవ్రంగా స్తంభించిపోయింది. పలు ప్రాంతాలు అధికారులు మూసివేయడంతో ఈ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ప్రధానంగా ఛాదర్గట్ బ్రిడ్జి వద్ద భారీ ట్రాఫిక్ కూడా ఏర్పడింది. ఇక వాహనదారులు బ్రిడ్జి వైపుగా వెళ్లకుండా ప్రత్యామ్నాయ మార్గాలలో వెళ్లాలని సీఎంఓ కూడా ఆదేశించింది.
#WATCH | Telangana: Officials distribute food to flood-affected people near the Chaderghat Musi River in Hyderabad. The Musi River has been overflowing since yesterday after officials opened the gates of Himayat Sagar reservoir due to heavy rainfall in the state. pic.twitter.com/xSSpdpd5ne
— ANI (@ANI) September 27, 2025
ఇదిలా ఉండగా మహాత్మా గాంధీ బస్ స్టేషన్ లో కూడా వరద నీరు వచ్చి చేరిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ కూడా ఎంజీబీఎస్ మార్గాలు కాకుండా ప్రత్యేక మార్గాల్లో ప్రయాణీకులు వెళ్లాలని కూడా సూచించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook