)
Vikarabad Murder: ఓ వ్యక్తి ముగ్గురు కుటుంబ సభ్యులను దారుణంగా హత్య చేసిన ఘటన వికారాబాద్ జిల్లా కుల్కచర్లలో జరిగింది. ఆదివారం ఉదయం గ్రామానికి చెందిన వేపూరి యాదయ్య అనే వ్యక్తి తన భార్య ఇద్దరు పిల్లలతో పాటు వదినను కత్తితో నరికాడు ఇందులో పెద్ద కూతురు తప్పించుకున్నట్లు సమాచారం. మిగతా అందరినీ దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. సానుకూల ప్రకారం సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. హత్యకు గల కారణాలు దర్యాప్తు చేస్తున్నారు. ఘటన స్థలానికి వెళ్లి డీఎస్పీ పరిస్థితులను పరిశీలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
కుటుంబ కలహాలే కారణం..
అయితే ఈ ముగ్గురు హత్యలకు కారణం కుటుంబ కలహాలేనని తెలుస్తోంది. పోలీసుల వివరాలు ప్రకారం భార్య అలివేలు, ఆమె సోదరీ హనుమమ్మ, చిన్న కూతురు శ్రావణి నిద్రిస్తుండగా యాదయ్య ఈరోజు తెల్లవారుజామున 3 గంటల సమయంలో కత్తితో పొడిచి హత్య చేశాడు. అయితే పెద్ద కూతురుపై కూడా దాడి చేయగా అపర్ణ అక్కడి నుంచి తప్పించుకుంది. అనంతరం ఆయన కూడా సూసైడ్ చేసుకున్నాడు. ఇక ఈ ఘటనపై తీవ్రంగా పరిగణించిన డీఎస్పీ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. ఇక మృతదేహాలను స్థానికంగా ఉన్న ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
నా ముందే నరికి చంపాడు..
ఈ ఘటనలో ప్రాణాలతో బయటపడిన పెద్ద కూతురు అపర్ణ.. ఘటనకు సంబంధించి అధికారులకు వెల్లడించింది. ట్రిపుల్ మర్డర్ కేసులో తప్పించుకున్న ఈ పెద్ద కూతురు రాత్రి తన పెద్దమ్మతో నాన్న గొడవ పడ్డాడు. ఆ తర్వాత నిద్ర పోయాం, అయితే ఒక్కసారిగా నాన్న పెద్దమ్మను కత్తితో నరికాడు. దీంతో భయందోళనకు గురయ్యారు తల్లిపిల్లలు. తన తల్లి వచ్చి పెద్దమ్మను చంపుతుండటం ఆపుతుండగా ఆమెను కూడా నరికి చంపేశాడట. వారిద్దరూ చనిపోయి రక్తపుమడుగులో పడి ఉన్నారు. దీంతో మీరు కూడా ఎందుకు అని చెల్లిని నరికాడు.. తనపై కూడా దాడి చేయడానికి రాగానే తప్పించుకొని పారిపోయింది. ఆ తర్వాత నాన్న చచ్చిపోయాడు అని చెప్పుకొచ్చింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.