close

News WrapGet Handpicked Stories from our editors directly to your mailbox

దొంగతానికి పాల్పడుతున్నాడంటూ వ్యక్తిని కొట్టిచంపిన గ్రామస్తులు !!

నిజామాబాద్ జిల్లాలో అనుకోని విధంగా ఓ వ్యక్తి మృత్యవాత పడ్డాడు.

Updated: Jun 15, 2019, 01:58 PM IST
దొంగతానికి పాల్పడుతున్నాడంటూ వ్యక్తిని కొట్టిచంపిన గ్రామస్తులు !!

నిజమాబాద్ జిల్లాలో సంచలన ఘటన చోటు చేసుకుంది.  తమ గ్రామంలోకి వచ్చి దొంగతనానికి పాల్పడుతున్నాడంటూ రాజేష్ అనే వ్యక్తిని కొట్టి చంపారు గ్రామస్తులు. వర్ని మండలం జలాల్‌పూర్‌లో ఘటన చోటు చేసుకుంది. ప్రముఖ మీడియా కథనం ప్రకారం శుక్రవారం అర్థరాత్రి సమయంలో  గ్రామంలోని భూమయ్య అనే వ్యక్తి ఇంట్లో చోరీకి పాల్పతుండగా ఇంటి యజమాని అడ్డుకున్నాడు. దొంగతానికి పాల్పడుతున్న విషయాన్ని తెలుసుకున్న ఇంటియజమాని చుట్టుపక్కల వారిని పిలవడంతో ..అక్కడికి వచ్చిన గ్రామస్తులు దొంగపై ముకుమ్మడిగా దాడికి తెగపడ్డారు. ఈ దాడిలో దోపిడికి వచ్చిన రాజేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు

గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి

ఇదిలా ఉండగా రాజేష్ మరణవార్త విన్న అతని బంధువులు ఘటనా స్థాలానికి చేరుకొని ఆందోళనకు దిగారు. రాజేష్ ను అన్యాయంగా హతమర్చారంటూ ఆరోపణలకు దిగారు.  భూమయ్య ఇంటి ఎదుటే రాజేష్ కు అంత్యక్రియలు నిర్వహిస్తామని పట్టుబడుతున్నారు. కాగా ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఘటనపై కేసు నమోదు చేసి న పోలీసులు విచారణ జరుపుతున్నారు.ఇరువర్గాల ఘర్షణతో ప్రస్తుతం గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది