BRS Party Padayatra: గొంతెండుతున్న గోదావరి.. కేసీఆర్ ఇంటికి బీఆర్‌ఎస్‌ పార్టీ పాదయాత్ర

BRS Party Starts Padayatra Against Revanth Reddy Failure: పదేళ్లు సుభిక్షంగా ఉన్న తెలంగాణ.. జలసిరులతో కళకళలాడుతున్న గోదావరమ్మ గొంతెండుతుండడంతో బీఆర్‌ఎస్‌ పార్టీ పోరుబాట పట్టింది. రేవంత్‌ రెడ్డి నిర్లక్ష్యంపై గళమెత్తుతూ పాదయాత్ర ప్రారంభించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 17, 2025, 07:16 PM IST
BRS Party Padayatra: గొంతెండుతున్న గోదావరి.. కేసీఆర్ ఇంటికి బీఆర్‌ఎస్‌ పార్టీ పాదయాత్ర

Godavari Basin Water Crisis: అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా గోదావరి, కృష్ణ పరివాహాక ప్రాంతాలు నీళ్లు లేక ఆయకట్టు రైతులతోపాటు ఇతర రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సాగునీటితోపాటు తాగునీటికి ఇబ్బందులు ఏర్పడడంతో బీఆర్‌ఎస్‌ పార్టీ ఉద్యమ బాటకు శ్రీకారం చుట్టింది. నాడు ముఖ్యమంత్రి కేసీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్టుతో గోదావరి పరివాహక ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయగా.. ఇప్పుడు రేవంత్‌ రెడ్డి నిర్లక్ష్యంతో కరువు పరిస్థితులు తలెత్తాయని రైతులు వాపోతున్నారు. రైతులకు మద్దతుగా కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా బీఆర్‌ఎస్‌ పార్టీ పాదయాత్ర ప్రారంభించింది. 180 కిలోమీటర్లు పాదయాత్ర చేసి మాజీ సీఎం కేసీఆర్‌ను కలిసి గొంతెండుతున్న గోదావరి పరిస్థితులు వివరిస్తామని బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రకటించింది.

Add Zee News as a Preferred Source

Also Read: Revanth Reddy Politics: 'వారికి' రేవంత్‌ రెడ్డి ఝలక్‌.. రాజకీయంగా సరికొత్త వ్యూహం

కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ గులాబీ పార్టీ శ్రేణులు మహా పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణ శివారు గోదావరి నది నుంచి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మహా పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ పార్టీ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్, మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యేలు పుట్ట మధుకర్, నడిపెల్లి దివాకర్ రావు పాల్గొని గోదావరి నది వద్ద కొబ్బరికాయ కొట్టి పూజలు చేశారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాదయాత్రను కొనసాగించారు.

Also Read: Telangana Congress: మీనాక్షి 'ఆపరేషన్‌' మొదలైందా..? రేవంత్‌ రెడ్డికి చెక్‌ పడిందా?

ఆరు రోజులపాటు కొనసాగే ఈ పాదయాత్ర చివరి రోజు ఎర్రవెల్లిలోని బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ క్షేత్రానికి చేరుకుంటుంది. పాదయాత్ర అక్కడ ముగించి కేసీఆర్‌కు గోదావరి ప్రాంతంలో ఉన్న పరిస్థితులను వివరించనున్నారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షులు కోరుకంటి చందర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధనతో పాటు రాష్ట్రాన్ని జల సిరులతో మాజీ సీఎం కేసీఆర్‌ సస్యశ్యామలం చేశారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ దుర్మార్గపు పాలనలో ప్రజలు అరిగోస పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ 180 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తామని ప్రకటించారు. పాదయాత్ర చేస్తూ మార్గమధ్యలో వివిధ ప్రాంతాలలో ఉన్న ప్రజలు.. రైతులను కలిసి అక్కడి వ్యవసాయ పరిస్థితులను అడిగి తెలుసుకుంటామని వివరించారు. పాదయాత్ర ముగిసిన అనంతరం మాజీ సీఎం కేసీఆర్‌కు రైతుల కష్టాలు వివరిస్తామని కోరుకంటి చందర్ తెలిపారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News