Water Supply Disruption in several areas in Hyderabad: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా హనుమాన్ జయంతి పండగను చేసుకొవడానికి భక్తులు ఏర్పాట్లుచేస్తున్నారు. ఇప్పటికే ఆలయాలు అన్ని ముస్తాబైపోయాయి. ఈ క్రమంలో ప్రస్తుతం భక్తుల తమ ఇళ్లను శుభ్రం చేసుకుంటున్నారు. అసలే సమ్మర్.. భానుడు సుర్రున మండిపోతున్నాడు.
ప్రతిదానికి కూడా వాటర్ అవసరం ఉంటుంది. అసలు ఇంట్లో సరిపడా నీళ్లు లేకుంటే జనాలకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ క్రమంలో హైదరాబాద్ లో జనాలు చాలా చోట్ల ఇప్పటికి మంచి నీళ్లు, ఇతర అవసరాల కోసం .. నల్లా నీళ్ల మీద ఆధారపడి ఉంటారు.ఈ నేపథ్యంలో హైదరాబాద్లో గోదావరి జలాలను జలమండలి కుళాయిల ద్వారా సరఫరా చేస్తుంది.
అయితే.. గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై పథకంలో భాగంగా హైదర్‌నగర్ నుంచి అల్వాల్ వరకు ఉన్న 1200 ఎంఎం డయా ఎంఎస్ గ్రావిటీ మెయిన్ పైపులైనుకు షాపూర్‌నగర్ పైపులలో పగుళ్లు ఏర్పడ్డాయి. దీంతో వాటర్ లీక్ అవుతుంది. ఈ క్రమంలో.. అధికారులు నీటి లీకేజ్ ను నివారించడానికి మరమ్మత్తుపనులు చేసేందుకు నిర్ణయించారు.
శనివారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు ఈ పనులు చేస్తున్నట్లు జీహెచ్ఎంసీ జలమండలి ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈక్రమంలో.. ఆయా డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాలలో రేపు తాగునీటి సరఫరాకు తాత్కలికంగా అంతరాయం ఉంటుందని జలమండలి ఒక ప్రకటనలో తెలిపింది. డివిజన్-12 పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా, మరికొన్ని ప్రాంతాల్లో పాక్షికంగా నీటి సరఫరాలో అంతరాయం కలుగుతుందని అధికారులు ప్రకటించారు.
Read more: Pawan Kalyan Son: పవన్ కొడుకు హెల్త్‌పై జుగుప్సాకరమైన పోస్టులు.. ఏపీ పోలీసులు సీరియస్..
ముఖ్యంగా.. కలావతినగర్, షాపూర్ నగర్, సంజయ్ గాంధీనగర్, హెచ్‌ఎంటీ సొసైటీ, హెచ్‌ఏఎల్ కాలనీ, రోడమేస్ నగర్,టీఎస్ ఐఐసీ కాలనీ, శ్రీనివాస్ నగర్, కైసర్ నగర్, బాలాజీ లే అవుట్, కైలాస్ హిల్స్, దేవేందర్ నగర్, శ్రీసాయి హిల్స్, గాజుల రామారం తదితర ప్రాంతాలలో నీటి సరఫరాకు అంతరాయం ఉంటుందని జలమండలి అధికారులు తెలిపారు.ఈ ఒక్కరోజు ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలలో నీళ్లను తెచ్చుకొవాలని అధికారులు కోరారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









