KTR Foreign Tour: అధికారంలో ఉన్నా లేకున్నా తెలంగాణ అభివృద్ధికి, పెట్టుబడుల కోసం పాటుపడుతూనే ఉంటామని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. 'బీఆర్‌ఎస్ పార్టీ ప్రభుత్వ విధానాలతో పెట్టుబడులకు గమ్యస్థానంగా తెలంగాణ మారింది. తెలంగాణపై తమకు ఉండే ప్రేమ, అభిమానం ఇంకెవరికీ ఉండవు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే వారికి సహకారం అందించాలి' అని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
Also Read: LSG Field Mistakes: వీళ్లు ప్రొఫెషనల్ ఆటగాళ్లా? చిన్న పిల్లలా? లక్నో చెత్త ఫీల్డింగ్ ఇవిగో..
యునైటెడ్ కింగ్ డమ్ తెలుగు బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో బుధవారం కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిగా కేసీఆర్ చేసిన అభివృద్ధి, పారిశ్రామిక విధానాలు ఎన్నారైలకు వివరించారు. 'అధికారంలో ఉన్నా లేకున్నా తెలంగాణ అభివృద్ధి కోసం త్రికరణశుద్దిగా పనిచేస్తూనే ఉంటాం' మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ సాధకులుగా, మాతృభూమిపై తమకుండే మమకారం ఇంకెవరకీ ఉండదన్నారు. యూకే పర్యటనలో ఉన్న కేటీఆర్ ను పలువురు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు,యునైటెడ్ కింగ్ డమ్ తెలుగు బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధులు ఈరోజు కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు, వ్యాపార నిర్వహణకు ఎదురవుతున్న సవాళ్లతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వ అభివృద్ధి నిరోధక విధానాలపై సమావేశంలో చర్చించారు.
Also Read: K Kavitha: కేసీఆర్‌కు ఎమ్మెల్సీ కవిత షాక్.. నాన్నకు పోటీగా 'కొత్త సంఘం' ప్రారంభం
'ముఖ్యమంత్రిగా కేసీఆర్ అమలుచేసిన ప్రగతిశీల విధానాలు.. తీసుకున్న పారిశ్రామిక అనుకూల నిర్ణయాలతో పది సంవత్సరాల కాలంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఎన్నో సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాయి' అని కేటీఆర్ వివరించారు. 'యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్, అడోబ్ వంటి కార్పొరేట్ దిగ్గజాలకు తెలంగాణ నయా చిరునామాగా మారింది' అని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో తీసుకున్న విప్లవాత్మకమైన నిర్ణయాలు, తీసుకువచ్చిన పారదర్శక విధానాలతో పారిశ్రామిక రంగంలో దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ నిలిచిందని మాజీ మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు.
తెలంగాణ గడ్డను ప్రేమించే వ్యక్తిగా అధికారంలో ఉన్నా.. లేకున్నా రాష్ట్ర అభివృద్ధికి తాము కృషి చేస్తామని కేటీఆర్ ప్రకటించారు. తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చే ప్రతి ఒక్కరికి సాధ్యమైనంత సహకారం అందిస్తామని తెలిపారు. తెలంగాణ ప్రగతికి బ్రాండ్ అంబాసిడర్లుగా పనిచేయాలని ఎన్నారైలకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook









