Revanth Reddy: దేశంలోనే తొలిసారి తెలంగాణలో కులగణన చేసి చరిత్ర సృష్టించాం

We Creates History With Caste Census Says Revanth Reddy: తాము దేశంలోనే తొలిసారి కుల గణన చేసి చరిత్ర సృష్టించినట్లు రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. ప్రభుత్వ ఫలాలు ప్రజలందరికీ అందించడమే తమ లక్ష్యమని తెలుపుతూనే ప్రతిపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Feb 4, 2025, 02:53 PM IST
Revanth Reddy: దేశంలోనే తొలిసారి తెలంగాణలో కులగణన చేసి చరిత్ర సృష్టించాం

Telangana Assembly Session: తెలంగాణలో కుల గణన పూర్తయ్యిందని.. తాము తొలిసారి పూర్తి చేసి చరిత్ర సృష్టించామని ప్రభుత్వం ప్రకటించింది. ఎన్నికల కోసం కాదు తాము ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా కుల గణన చేసినట్లు తెలిపారు. కుల గణనపై నివేదికపై మంగళవారం ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం నిర్వహించిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి 'చిట్‌చాట్‌' చేశారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.

Add Zee News as a Preferred Source

Also Read: MLA Gunmen: దిగ్భ్రాంతికి గురిచేసే ఘటన.. ఎమ్మెల్యే గన్‌మెన్‌ ప్రాణం తీసిన 'అడవి పంది'

'56 శాతం బీసీలు, 17.5 శాతం ఎస్సీలు మొత్తం 73.5 శాతం ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పిస్తాం' అని రేవంత్‌ రెడ్డి తెలిపారు. కుల గణనపై ప్రధానిపై కూడా ఒత్తిడి పెరుగుతుందని పేర్కొన్నారు. కులగణన, ఎస్సీ వర్గీకరణకు రోడ్ మ్యాప్ తెలంగాణ నుంచి ఇస్తున్నట్లు చెప్పారు. సభలో ప్రవేశపెట్టే డాక్యుమెంట్ భవిష్యత్‌లో ఎపుడైనా రిఫరెన్స్ డాక్యుమెంట్ అవుతుందని వెల్లడించారు. దేశంలోనే మొదటిసారి కులగణన చేసి చరిత్ర సృష్టించినట్లు ప్రకటించారు. పకడ్బందీగా సర్వే చేసి సమాచారం సేకరించినట్లు వివరించారు.

Also Read: Harish Rao: రియల్టర్‌ది ఆత్మహత్య కాదు.. రేవంత్‌ రెడ్డి చేసిన హత్య

'ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు, మంత్రివర్గ ఉపసంఘం, ఏక సభ్య కమిషన్ సిఫార్సుల ప్రకారం వెళ్తాం' అని రేవంత్‌ రెడ్డి తెలిపారు. 'ప్రధాన ప్రతిపక్షానికి బాధ్యత.. చిత్తశుద్ది లేదు. వారిని పరిగణనలోకి తీసుకోవడం లేదు' అని బీఆర్‌ఎస్‌ పార్టీపై విమర్శలు చేశారు. 'రాజకీయం కోసం చేయడం లేదు ఈ డాక్యుమెంట్ ను డెడికేటెడ్ కమిషన్ తీసుకొంటుంది. కమిషన్ తగిన నిర్ణయం తీసుకుంటుంది' అని చెప్పారు. తాము 88 జనరల్ సీట్లలో 30 సీట్లు బీసీలకు ఇచ్చామని.. మొత్తం 33 శాతం సీట్లు ఇచ్చినట్లు వెల్లడించారు.

'కోర్టు ఇచ్చిన క్లిమిలేయర్‌ను తిరస్కరించాం. బీసీ రిజర్వేషన్లపై కోర్టు ఆదేశాల మేరకు కమిషన్ వేశాం. కోర్టు ఆదేశాల మేరకే కమిషన్ నిర్ణయం తీసుకుంటుంది. అసెంబ్లీకి రాని వారు అసెంబ్లీ సమయం గురించి మాట్లాడుతున్నారు. సమగ్ర కుటుంబ సర్వే రిపోర్ట్ ఎక్కడ ఉందో కూడా తెలియదు. సమగ్ర కుటుంబ సర్వే ఎవరు చేశారు? ఎలా చేశారు? ఆ రిపోర్ట్ ఎక్కడ పెట్టారో ఎవరికీ తెలియదు' అని రేవంత్‌ రెడ్డి విమర్శలు చేశారు. కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వడం ప్రక్రియలో భాగమని చెప్పారు. తాము ఎన్నికల కోసం కులగణన చేయలేదని.. అభివృద్ధి ఫలాలు అందించడం కోసమేనని తెలిపారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News