BC Round Table Meeting: బీసీ సామాజికవర్గానికి అన్యాయం చేస్తే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు బుద్ధి చెబుతామని.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయకపోతే కాంగ్రెస్ బిజెపి నాయకులను గ్రామాల్లో తిరగనివ్వం' అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. 'ఇదే కామారెడ్డి వేదికగా డిక్లరేషన్ చేస్తున్నాం. మాట తప్పితే కాంగ్రెస్ , బీజేపీ నాయకులను గ్రామాల్లో తిరగనివ్వం' అని ప్రకటించారు. 'అవసరమైతే మేము కూడా ఢిల్లీ వస్తాం. బీజేపీపై పోరాటం చేస్తాం కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం తప్పించుకునే ప్రయత్నం చేయవద్దు' అని చెప్పారు.
Also Read: Revanth Reddy: తన జైలు జీవితం గుర్తు చేసుకున్న రేవంత్ రెడ్డి.. కుమార్తె పెళ్లిపై భావోద్వేగం
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ కామారెడ్డిలో శనివారం కవిత రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత కీలక ప్రసంగం చేశారు. 'బీసీ డిక్లరేషన్ చేసిన నిజామాబాద్ జిల్లాలోనే ఒక్క బీసీ బిడ్డకు కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా వంచించింది' అని కవిత విమర్శించారు. అలవిగాని హామీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందని గురతుచేశారు. 'చరిత్రలో నిలిచిపోయే పనులు చేయాలి కానీ చరిత్ర హీనులుగా మిగలవద్దు' అని కవిత హితవు పలికారు.
Also Read: Ayodhya Surya Tilak అయోధ్య రాముడికి 'సూర్య తిలకం' ఎప్పుడు? ఎలా చూడాలి?
'ఇచ్చిన హామీ ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించకపోతే కాంగ్రెస్ పార్టీ చరిత్ర హీనులుగా మిగిలిపోతుంది' అని ఎమ్మెల్సీ కవిత హెచ్చరించారు. 'బీసీ బిల్లులు అసెంబ్లీ ఆమోదించిన తర్వాత చోటే భాయ్ బడే భాయ్‌కి అప్పగించారు. కోర్టులకు వెళ్తారా? లేదా ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీ కాళ్ల మీద పడతారా మాకు సంబంధం లేదు. కానీ 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయాల్సిందే' అని కవిత స్పష్టం చేశారు.
'అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. కానీ ఇప్పటివరకు ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వలేదు' అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తెలిపారు. తెలంగాణలో కంటే ఎక్కువ ఢిల్లీలోనే ఉండే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఎందుకు దొరకడం లేదు? అని ప్రశ్నించారు. బీసీల విషయం వచ్చేసరికి ప్రధాని అపాయింట్మెంట్ ఎందుకు దొరకడం లేదా? అని నిలదీశారు.
తమిళనాడులో అమలవుతున్న రిజర్వేషన్ల తరహాలో తెలంగాణలో కూడా అమలు చేయడానికి ప్రధాని మోదీ చొరవ తీసుకోవాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. రూ.4,500 కోట్లు ఖర్చు చేసి 2011లో నిర్వహించిన కులగలణన నివేదికను ఎందుకు బయట పెట్టడం లేదంటే కాంగ్రెస్ వద్ద సమాధానం లేదని పేర్కొన్నారు. రూ.4,500 కోట్లు గంగలో పోశారు కానీ లెక్కలు అయితే బయటకు ఇవ్వలేదని చెప్పారు. 'కులగణన చెయ్యబోమని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసి బీసీలను వంచించింది. తెలంగాణ చట్టసభలు ఆమోదించిన బీసీ బిల్లులను తక్షణమే పార్లమెంటు పాస్ చేయాలి. బీసీ బిల్లులను ఆమోదించడానికి తెలంగాణ బీజేపీ ఎంపీలు పార్లమెంటులో గళమెత్తాలి' అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.








