Khammam: 'ప్రతి పైసా ప్రజల అవసరాలకు ఖర్చు పెడతాం. ఎట్టి పరిస్థితుల్లో దోపిడీకి గురి కానివ్వం. ప్రజల సొమ్ము దోపిడికి గురైతే అత్యంత ప్రమాదకరం' అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రంలో ఎంత విద్యుత్తు డిమాండ్ పెరిగినా ఎలాంటి ఇబ్బంది లేకుండా కరెంటు సరఫరా చేసే వ్యవస్థను నెలకొల్పామని చెప్పారు. కరెంటు ఉత్పత్తి చేసింది.. రైతులకు ఉచితంగా ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వాలేనని వివరించారు. 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వమేనని చెప్పారు.
Also Read: Mowgli Teaser: యాంకర్ సుమ కొడుకు మోగ్లీ సినిమా టీజర్.. 'మగాడి జీవితంలో అదొక్కటే వరం!'
ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం గంధసిరిలో దేవాలయ అభివృద్ధి పనులకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. 'ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఎంత త్వరితగతిన ఇల్లు నిర్మించుకుంటే అంత వేగంగా బిల్లులు మంజూరు చేసుకుంటూ పోతాం. మన బిడ్డల భవిష్యత్తు మన భవిష్యత్తు వారి భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు విద్యారంగానికి పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తున్నాం' అని వెల్లడించారు.
Also Read: IPL 2026 Mini Auction: స్టార్ ప్లేయర్లను పంపించేస్తున్న ఐపీఎల్ ఫ్రాంచైజీలు.. ఎవరెవరో తెలుసా?
'మహిళలంతా ఆత్మగౌరవంతో బతకాలని వడ్డీ లేని రుణాలు అందిస్తున్నాం. ఐదు సంవత్సరాల్లో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మారుస్తాం. మధిర నియోజకవర్గంలో 60 వేల మంది మహిళా సభ్యులు ఉన్న ఇందిరా మహిళ డైరీ దేశానికి తలమానికంగా ఉండబోతోంది' అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. రెండు సంవత్సరాల్లో 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని.. లక్షలాది సంఖ్యలో ప్రైవేటు ఉద్యోగాల భర్తీ కోసం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో యువతకు ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జాబ్ మేళాలు నిర్వహిస్తోందని పేర్కొన్నారు.
Also Read: Jubilee Hills Exit Polls: జూబ్లీహిల్స్ ఎగ్జిట్ పోల్స్.. మళ్లీ బీఆర్‌ఎస్ గెలుస్తుందా? కాంగ్రెస్?
'ఎక్కడ ఉన్న ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తా. మధిర నియోజకవర్గ ప్రజలు వేసిన ప్రతి ఓటుకు గౌరవం తీసుకువస్తా' అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రంలో 96 లక్షల కుటుంబాలకు సన్నబియ్యం ఇస్తున్నామని చెప్పారు. 'తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం,నీటి పారుదల ప్రాజెక్టుల కోసం ఆనాడు ప్రజలు ఉద్యమించారు. ఇప్పుడున్నది ప్రజా ప్రభుత్వం. ప్రజల కోసమే పనిచేస్తుంది' అని తెలిపారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో చాలా వాగ్దానాలు చేశామని.. వాటన్నింటినీ నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. మహిళలకు వడ్డీలేని రుణాలు ఇస్తున్నామని.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కరెంటు ఉండదని ఆనాటి బీఆర్‌ఎస్ నాయకులు చెప్పారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గుర్తుచేశారు. ప్రజల సంక్షేమం ప్రభుత్వ బాధ్యత అని ప్రకటించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









