Heavy Rains in Telangana: తెలంగాణలో సూర్యుడు వేడికి ప్రజలు అల్లాడుతున్నారు. మార్చిలోనే ఎండలు మండుతున్నాయి. బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. ఉక్కబోతతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. చల్లదనం కోసం ఇంట్లో ఏసీలు, కూలర్లను ఆశ్రయిస్తున్నారు. మరోవైపు ఎండలో చల్లదనం కోసం చల్ల మజ్జిగ, రాగి జావాలను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. బయట తిరగాలంటే మాడు పగిలిపోతుంది.
అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. తెలంగాణలో నేటి నుంచి వర్షాలు పడనున్నాయి. మూడు రోజుల పాటు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనానికి చల్లటి కబురు అందించింది. ముఖ్యంగా మహబూబాబాద్, సిరిసిల్ల, జగిత్యాల, భూపాలపల్లి, జనగామ, వరంగల్, హన్మకొండ, సిద్ధిపేట జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి తెలిపింది. కొన్ని జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరించింది. వర్షాల వల్ల మామిడి సహా ఇతర పంటలు పండించే రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. ఇప్పటికే పూతకు వచ్చిన మామిడి పంట .. వర్షాలకు పాడైపోయే అవకాశాలున్నాయి. మరోవైపు ఆరు బయట మిర్చి ఎండబెట్టే రైతులు వాతావరణాన్ని బట్టి మిర్చి యార్డుల్లో ఎండబెట్టకుండా ఉంటే బెటర్ అని సలహా ఇస్తున్నారు.
ఇదీ చదవండి: నిహారిక మళ్లీ పెళ్లి కూతురు అవుతుందోచ్.. పెళ్లి కొడుకు ఫిక్స్..?
ఇదీ చదవండి: టబుకు అన్న ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా.. ! అస్సలు ఎక్స్ పెక్ట్ చేయరు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









