Telangana Rains: ఎండా కాలంలో కురిసిన అకాల వర్షాలతో వాతావరణం చల్లబడినా.. రైతులను మాత్రం హడలెత్తిస్తున్నాయి. పలు చోట్ల వర్షాలకు కల్లాల్లో ఆరబోసిన ధాన్యంతో పాటు మిరప తడిసి ముద్దయ్యాయి. ఈ రోజు ఖమ్మం, ములుగు, కొత్తగూడెం, నల్గొండ, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, సూర్యాపేట, యాదాద్రి, జనగామ జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ తెలిపింది. మంగళ, బుధవారాల్లో భద్రాద్రి, ఖమ్మం, ములుగు, జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని వివరించింది.
నిన్న జనగామ, సూర్యాపేట, యాదాద్రి, భద్రాద్రి, ఖమ్మం, సిద్దిపేట జిల్లాల్లో వడగళ్లతో భారీ వర్షాలు పడ్డాయి. ఆదివారం కురిసిన వర్షాలతో జనగామ, సిద్దిపేట, నల్గొండ, యాదాద్రి భువనగిరి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పది వేలకు పైగా ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది.
వడగళ్ల వానలతో పలు గ్రామాల్లో మామిడికాయలు, ధాన్యం గింజలు రాలిపోయాయి. పలుచోట్ల వ్యవసాయ మార్కెట్లకు రైతులు తెచ్చిన ధాన్యం వాననీటికి కొట్టుకుపోయింది. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూర్ మండలంలోని చామాపూర్‌లో విద్యుత్తు స్తంభాలు నేలకూలాయి. ఖమ్మం- దేవరాపల్లి పాత జాతీయ రహదారిపై ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం టేకులపల్లి-సీతారాంపురం సమీపంలో చెట్లు పడిపోవటంతో రెండువైపులా 4 కి.మీ. మేర రెండు గంటల పాటు వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.
READ ALSO: Chiranjeevi: చిరంజీవికి భార్యగా..చెల్లిగా.. అక్కగా.. తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్..
READ ALSO: Prabhas Vs Venkatesh: కథ ఒక్కటే.. వెంకటేష్ డిజాస్టర్.. ప్రభాస్ బ్లాక్ బస్టర్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









