)
Telangana Rains: బంగాళాఖాతంలో అల్ప పీడనం కారణంగా తెలంగాణలో భారీ వర్షాలు కురవనున్నాయి. ముఖ్యంగా ఈ నెల 15 నుంచి ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, మహబుబాబాద్, నాగర్‌కర్నూల్ ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, జిల్లాలో భారీ వానలు పడతాయని వాతావరణశాఖ అలర్ట్ జారీ చేసింది.
మరో 5 రోజులపాటూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయనీ, ఉరుములు, మెరుపులతో వానలు కురుస్తాయంటోంది. ఇక తెలంగాణ వ్యాప్తంగా గాలి వేగం గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లుగా ఉంటుందని అంచనా వేసింది. ఇంకా.. తెలంగాణలో నేటి నుంచి 12 వరకూ అలర్ట్ జారీ చేసింది. వాతావరణశాఖ అంచనా ప్రకారం తెలంగాణలో ఉదయం వేళ, ఎండ, మేఘాల వాతావరణం ఉంటుంది. మధ్యాహ్నం 2 తర్వాత పరిస్థితి మారుతుంది.
హైదరాబాద్ సహా చాలా ప్రాంతాల్లో జల్లులు మొదలై... మధ్యాహ్నం 4 గంటలకు మోస్తరు వర్షంగా మారుతుంది. ఈ వర్షం అర్థరాత్రి 1 గంట వరకూ కురుసే అవకాశం వుందని తెలిపింది. మొత్తంగా తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో డ్యాములు, ప్రాజెక్టులు, జలపాతాల దగ్గర ఎవరు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాదు సరదగా సెల్పీలు అంటూ ప్రజలు ప్రాణం మీదికి తెచ్చుకుంటున్నారు. దీంతో ప్రమాదకరమైన జలపాతాలు ఉన్న ప్రాంతాల్లో పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఇక ప్రజలు ముఖ్యంగా యూత్ కూడా ఈ విషయం గురించి అవగాహన పెంచుకోవాలన్నారు. ఒక్క ఫోటో సరదా కోసం ప్రాణాలు మీదికి తెచ్చుకొని కుటుంబంలో విషాదం మిగులుస్తున్నారు. ఒక భారీ వర్షాల నేపథ్యంలో నదీ తీర ప్రవాహా ప్రాంతంలో రోడ్డు కోతకు గురవుతున్నాయి. ప్రజలు ప్రయాణించే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.