
Telangana Rains: తెలంగాణలోని 17 జిల్లాలకు హైదరాబాద్ వాతావరణశాఖ అలర్ట్ ప్రకటించింది. రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశాలు ఉన్నాయని సూచించింది. అదే విధంగా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.
ఇప్పటికే పలు జిల్లాలలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఈనేపథ్యంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రేపు, ఎల్లుండి కూడా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ప్రజలు అలర్ట్ గా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచనలు చేస్తున్నారు.
ఇప్పటికే దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే కేరళ, కర్ణాటకలో భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్నాయి. అటు దేశ ఆర్ధిక రాజధాని ముంబైతో పాటు దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాలు పడుతున్నాయి. అటు ఉత్తర భారతంతో పాటు ఈశాన్య భారతంలో పలు చోట్ల భారీ వర్షాలు పడుతున్నాయి.ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఋతు పవనాలు విస్తరించడంతో తెలంగాణతో పాటు ఏపీ సహా దేశ వ్యాప్తంగా మరో రెండు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook .