Weather Update: తెలంగాణలో రానున్న మూడు రోజుల్లో ఓ మోస్తరు వాన కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు పేర్కొన్నారు. రానున్న ఐదురోజులపాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. భూ ఉపరితలం వేడెక్కడంతోపాటు ద్రోణి ప్రభావం వలన ఈ వర్షాలు పడనున్నాయని అధికారులు పేర్కొన్నారు.
బుధ, గురువారాల్లో ఉత్తర, పశ్చిమ జిల్లాల్లో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వాన పడనుంది. రానున్న రెండు రోజులపాటు రాష్ట్రంలో 40 నుంచి 50 కిమీల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపారు.
వడగండ్ల వాన పడనున్న ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇది వాయుగుండంగా మారి దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు తీరాల వైపు పయనించవచ్చని అంచనా వేస్తున్నారు. దీంతో ఆంధ్ర ప్రదేశ్ లో తీర ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. దీంతో సముద్రంలో వేటకు వెళ్లే మత్స్స కారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. అంతేకాదు వాయు గండం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
READ ALSO: Chiranjeevi: చిరంజీవికి భార్యగా..చెల్లిగా.. అక్కగా.. తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్..
READ ALSO: Prabhas Vs Venkatesh: కథ ఒక్కటే.. వెంకటేష్ డిజాస్టర్.. ప్రభాస్ బ్లాక్ బస్టర్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









