Telangana Rains: బిగ్ అలర్ట్.. హైదరాబాద్ సహా తెలంగాణకు భారీ వర్ష సూచన..

Telangana Rains:తెలంగాణ రాష్ట్రంలో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 15, 2025, 10:05 AM IST
Telangana Rains: బిగ్ అలర్ట్..  హైదరాబాద్ సహా తెలంగాణకు భారీ వర్ష సూచన..

Telangana Rains: తెలంగాణలో కొన్ని చోట్ల పగలు మాడు పగిలేలా ఎండ జాడించి కొడుతోంది. మరికొన్ని చోట్ల వడగండ్లతో కూడిన వర్షాలు పడుతున్నాయి. దీంతో కొన్ని చోట్ల ఈదురు గాలుల వలన చెట్లు కూలాయి. దీంతో పలు చోట్ల ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. అంతేకాదు పలు జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.

Add Zee News as a Preferred Source

అదే సమయంలో, రానున్న మూడు రోజుల పాటు పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వెల్లడించింది. రెండు నుంచి మూడు డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

తెలంగాణ లోని మంచిర్యాల,ములుగు, నల్గొండ, సూర్యాపేట, మహూబూబాబాద్, వరంగల్, హన్మకొండ, భూపాలపల్లి, జనగాం, సిద్ధిపేట, భువనగిరి, నాగర్ కర్నూల్, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో అక్కడకక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాదు పలు చోట్ల వర్షాల వలన కళ్లాల్లో ఎండ బెట్టిన ధాన్యం తడిసి ముద్ద అయింది.

READ ALSO:  Chiranjeevi: చిరంజీవికి భార్యగా..చెల్లిగా.. అక్కగా.. తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్..

READ ALSO:  Prabhas Vs Venkatesh: కథ ఒక్కటే.. వెంకటేష్ డిజాస్టర్.. ప్రభాస్ బ్లాక్ బస్టర్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News