Telangana Rains: తెలంగాణలో వచ్చే 3 రోజులు భయంకరంగా వానలు..

తెలంగాణలో నిన్న రాత్రి పలు జిల్లాలతో పాటు హైదరాబాద్ వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు నగరం తడిసి ముద్దైయింది. అంతేకాదు అకాల వర్షాలతో చేతికి వచ్చిన మామిడి పంట నేల రాలింది. మొత్తంగా అకాల వర్షాలతో సామాన్యులు కాస్తంత వేడి తగ్గిందని సంతోషిస్తుంటే.. రైతులు మాత్రం లబోదిబో మంటున్నారు. మరోవైపు  రానున్న మూడు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా వడగండ్ల వానలు మరో మూడు రోజులు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది.

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 22, 2025, 01:03 PM IST
Telangana Rains: తెలంగాణలో వచ్చే 3 రోజులు భయంకరంగా వానలు..

Telangana Rains: తెలంగాణలో నిన్న రాత్రి పలు జిల్లాలతో పాటు హైదరాబాద్ వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు నగరం తడిసి ముద్దైయింది. అంతేకాదు అకాల వర్షాలతో చేతికి వచ్చిన మామిడి పంట నేల రాలింది. మొత్తంగా అకాల వర్షాలతో సామాన్యులు కాస్తంత వేడి తగ్గిందని సంతోషిస్తుంటే.. రైతులు మాత్రం లబోదిబో మంటున్నారు. మరోవైపు  రానున్న మూడు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా వడగండ్ల వానలు మరో మూడు రోజులు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది.

Add Zee News as a Preferred Source

ఆదిలాబాద్ కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, ములుగు, వరంగంల్ జిల్లాల్లో వడగండ్ల వానలు ప్రభావం ఉంటుందని తెలిపింది. ఈ రోజు, రేపు కూడా   ఉరుములు మెరుపులు,ఈదురు గాలులతో కూడిన  వడగండ్ల వానలు కురిస అవకాశాలున్నాయని తెలిపింది.

ఇక నిన్న రాత్రి తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాలు, పెద్దపల్లి,  జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన గంటకు 40నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన  వడగండ్ల వాన కురిసింది.  అటు నిర్మల్, నిజామాబాద్, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు గంటలకు 30నుంచి -40 కి.మీ.వేగంతో వీయడంతో పంటలు నీట మునగడంతో రైతులు రోడ్డున పడ్డారు.  

READ ALSO: Star Heroine: హిందువుగా పుట్టి.. ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకొని.. ప్రస్తుతం క్రైస్తవ మతం అనుసరిస్తున్న స్టార్ హీరోయిన్..

READ ALSO:  Madhuri Dixit: షాకింగ్.. మాధురి దీక్షిత్ అందానికి మై మరిచిపోయి పెదవులను రక్తం కారేలా కొరికేసిన మాజీ ఎంపీ..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News