Heat Waves in Telangana: తెలంగాణ నిప్పుల కొలిమిలా మారింది. గత రెండు రోజులుగా ఎండ తీవ్రత ముదిరింది. బయట అడుగుపెట్టాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. ఇప్పటికే తెలంగాణ గతంలో ఎన్నడు లేనట్టుగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఉదయం 8 నుంచే సూర్యుడు నిప్పుల కొలిమిలా మారాడు. గ్రేటర్ హైదరాబాద్ లో పగటి ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటాయి. మరికొన్ని పారిశ్రామిక వాడల్లో మాత్రం ఉష్ణోగ్రతుల 44 డిగ్రీల వరకు నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా మధ్యాహ్నం 11 నుంచి సాయంత్రం 4 వరకు ప్రధాన రోడ్లు బోసి పోతున్నాయి. ఎండ కారణంగా ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది.
భానుడి భగభగలతో నగరవాసులు అల్లాడిపోతున్నారు. ఉదయం 9 గంటల నుంచే నిప్పులు చెరుగుతున్నాడు. గ్రేటర్‌లో పగటి ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల వరకు చేరడంతో బయటకు వచ్చేందుకు నగరవాసులు వణికిపోతున్నారు. ఇంట్లో ఏసీ లేకుండా గంటకూడ ఉండలేని పరిస్థితులు నెలకొన్నాయని మోతీనగర్‌కు చెందిన రత్నం రాజు తెలిపారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 వరకు వేడిగాలుల కారణంగా ప్రధాన రహదారులపై ట్రాఫిక్ రద్దీ తక్కువగా ఉంటుంది. ఏదైనా ఎమర్జన్సీ డ్యూటీ ఉన్నవాళ్లు పోలీస్, హాస్పిటల్, మీడియా తదితరులు మధ్యాహ్నం షిఫ్ట్ కు ఆఫీసుకు వెళ్లాలంటే చుక్కలు కనిపిస్తున్నాయి.
మరోవైపు మార్నింగ్ షిఫ్ట్ డ్యూటీలో ఉన్నవాళ్లు ఇంటి వెళ్లడానికి అదే తరహాలో సూర్యుడు వేడికి తాళలేకపోతున్నారు. ఈ నెల 30 వరకు ఉత్తరాది నుంచి వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దీంతో పగటి ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల వరకు పెరిగే అవకాశాలున్నాయి.
మరోవైపు కోల్ బెల్ట్ ఏరియాలో ఉండే ఏరియాలో ఉదయం నుంచే సూర్యుడు సుర్రు మనిపిస్తున్నాుడ. ఏదైనా అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లడం లేదు. ముఖ్యంగా బయటకు వెళ్లేవారు వెంట నీళ్ల బాటిల్ క్యారీ చేయాలని డాక్టర్లు చెబుతున్నారు. మొత్తంగా చిన్నపిల్లలు, వృద్దులు ఎండలో బయట తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లో కూడా వేడి గాలుల కారణంగా వడదెబ్బ తగిలే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఇదీ చదవండి: కమల్ హాసన్, వాణి గణపతి ఎందుకు విడిపోయారు.. విడాకుల సందర్భంగా ఇచ్చిన భరణం ఎంతో తెలుసా.. !
ఇదీ చదవండి: భర్తపై ప్రతీకారంతో వివాహేతర సంబంధం పెట్టుకున్న స్టార్ హీరోయిన్.. ఈ రేంజ్ కాంట్రవర్షల్ నటి మరొకరు లేరేమో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









