Telangana Rains: ఎండలతో సతమతమవుతున్న తెలంగాణ వాసులకు వర్షంతో కాస్తంత చల్లబడ్డ .. ఈ అకాల వర్షాలకు రైతులు ఇళ్లు కడగండ్ల పాలయ్యాయి. తెలంగాణతో పాటు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. కూకట్ పల్లి, హైదర్ నగర్, ఆల్విన్ కాలనీ, నిజాంపేట, ప్రగతి నగర్, బాచుపల్లి, మూసాపేట, ఉప్పల్, మల్లాపూర్, తార్నాక, బాలాపూర్, చంద్రాయణ గుట్ట, సికింద్రాబాద్, బోయిన్ పల్లి, తిరుమలగిరి ఏరియాలతో భారీ వర్షం పడింది.
గత కొన్ని రోజులుగా నగరంలో ఎండలు తీవ్రరూపం దాల్చాయి. ఉదయం నుంచే భానుడు ప్రతాపం చూపుతున్నారు. దీంతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓ వైపు ఉక్కపోత.. మరోవైపు చెమటతో అవస్థలు పడుతున్నారు. ఇలాంటి సమయంలో హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. దీంతో నగర వాసులు ఉపశపనం పొందుతున్నారు.
ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షం పడింది. ఉత్తర తెలంగాణలో భారీ వర్షంతో పాటు ఈదురు గాలులు, వడగల్లు పడటంతో చాలా చోట్ల పంటలు దెబ్బతిన్నాయి. పలుచోట్ల చెట్ల కొమ్మలు విరిగి రోడ్లపై పడ్డాయి. కొన్ని ప్రాంతాల్లో డ్రైనేజీలు పొంగి మురుగు నీళ్లు రోడ్లపై పారాయి. కొన్ని ఏరియాల్లో విద్యుత్ సరఫరాకు పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి పోయిన కరెంట్ ఉదయం తెల్లవారేవరకు రాలేదు. అంతరాయం కలిగింది. అకాల వర్షం నేపథ్యంలో వాతావరణ శాఖ కూడా అలర్ట్ ప్రకటించింది. మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









