)
Web casting and Using drones at all polling stations in Jubilee hils by polls: తెలంగాణలో హైదరాబాద్ లోని జూబ్లిహిల్స్ ఎన్నికల ప్రచారంకు తెరపడింది. వెంటనే ప్రత్యేకంగా పోలింగ్ జరిగే నియోజక వర్గం పరిధిలో సీపీ సజ్జనార్ ఇప్పటికే తెలిపిన విధంగా రూల్స్ అమల్లోకి వచ్చేశాయి. ఈ క్రమంలో ఎన్నికల అధికారి ఆర్వీకర్ణన్ జూబ్లిహిల్స్ ఉపఎన్నికల నిర్వాహణపై మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల ప్రచారంకు గడుపు ముగిసిపోయిందన్నారు. నవంబర్ 11న జరిగే ఉపఎన్నికలకు అన్నివిధాలుగా ఏర్పాట్లు చేశామన్నారు.
ఎన్నికల బరిలో 58 మంది ఉన్నారన్నారు. మొత్తంగా 4 బ్యాలెట్ యూనిట్లు ఉంటాయన్నారు. సోమవారం కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డిస్టేడియంలో ఎన్నికల సామాగ్రి పంపిణీ చేస్తామన్నారు. నియోజక వర్గంలో 407 పోలీంగ్ స్టేషన్ లు ఉన్నాయన్నారు. అన్ని పోలింగ్ స్టేషన్లలో వెబ్ కాస్టింగ్ ఉంటుందన్నారు.
ఈసారి డ్రోన్లను కొత్తగా నిఘా ఉంటుందని ఎన్నికల అధికారి ఆర్వీకర్ణన్ స్పష్టం చేశారు. మొత్తంగా..407 పోలింగ్ స్టేషన్స్ ని, 139 లొకేషన్స్ లో ఏర్పాటు చేశామన్నారు. ఈ సారి ఓటింగ్ సమయాన్ని గంట పొడిగించడం జరిగిందన్నారు. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6 గంటలు ఓటు హక్కు వినియోగంకు అవకాశం ఉంటుందన్నారు.
ఆరు గంటలు లోపల క్యూలైన్ లో ఉన్న ప్రతి ఒక్కరికి ఓటు అవకాశం ఉంటుందని తెలిపారు. ఐడి ప్రూఫ్ ఖచ్చితంగా తీసుకొని రావాలన్నారు. ఈవీఎం మాక్ పోల్ ఉదయం ఐదు గంటలకు ఉంటుందన్నారు. ఫ్లైయింగ్ స్క్వాడ్ 45, స్టాటిక్ సర్వేలయన్స్ టీమ్స్ -45, వీడియో సర్వేలయన్స్ 4 ఏర్పాటు చేశామన్నారు.
2060 మంది పోలింగ్ సిబ్బంది పని చేస్తారని ఆర్వీ కర్ణన్ తెలిపారు. ఎన్నికల సామాగ్రిని కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి స్టేడియం లో ఇస్తున్నామనితెలిపారు. సోషల్ మీడియాలో ఫేక్ సమాచారం ప్రసారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీని కోసం స్పెషల్ టీమ్స్ పని చేస్తున్నాయని ఎన్నికల అధికారి ఆర్వీకర్ణర్ తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.