Harish Rao: గులాబీ లీడర్, ట్రబుల్ షూటర్ హరీశ్ రావు బర్త్ డే గులాబీ శ్రేణుల్లో కొత్త జోష్ నింపింది. మాజీమంత్రి జన్మదినం సందర్భంగా.. హైదరాబాద్ నగరంలో అనేక చోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో నగరం గులాబీమయం అయ్యింది. తమ నాయకుడు 54వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా సిద్దిపేటలో బీఆర్‌ఎస్ నేతలు హరీశ్‌రావు సైకతశిల్పాన్ని ఏర్పాటు చేసి విషేష్ తెలిపారు. ఇక సీఎం రేవంత్ రెడ్డితో పాటు బీఆర్‌ఎస్‌లో కీలక నేతలంతా హరీష్‌రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కానీ మాజీమంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత మాత్రం.. హరీశ్ రావుకు విషేస్ చెప్పకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆ ఇద్దరు నేతలు హరీశ్ రావుకు జన్మదిన శుభాకాంక్షలు ఎందుకు చెప్పలేదో తెలియక గులాబీ శ్రేణులు పరేషాన్ అవుతున్నారని టాక్..
కొద్దిరోజులుగా బీఆర్ఎస్ పార్టీలో ఆధిపత్య పోరు నడుస్తుందనే టాక్ ఉంది. గులాబీ బాస్ కేసీఆర్ తర్వాత.. బీఆర్‌ఎస్ పగ్గాలు కేటీఆర్‌కు ఇస్తారా లేక హరీశ్ రావుకు అప్పగిస్తారా అనే చర్చ జరిగేది. కానీ ఇటీవల హరీశ్ రావు.. కేటీఆర్ డైరెక్షన్‌లో తాను పనిచేసేందుకు రెడీగా ఉన్నానని ప్రకటించారు. పార్టీలో ఏ బాధ్యతలు అప్పగించినా.. పని చేసేందుకు సిద్దంగా ఉన్నానని చెప్పారు. దాంతో కేసీఆర్ తర్వాత.. కేటీఆరే బీఆర్‌ఎస్ బాస్ అని స్వయంగా హరీషే ఒప్పుకున్నారు. అంతలోపే కవిత రూపంలో బీఆర్‌ఎస్‌కు గట్టి షాక్ తగిలింది. బీఆర్‌ఎస్ పార్టీలో అంతర్గత సమస్యలను ప్రస్తావిస్తూ.. కవిత కేసీఆర్‌కు లేఖ రాయడం ఆ లేఖ లీక్ కావడం చకచక జరిగిపోయాయి.. ఆ తర్వాత కవిత.. నేరుగా కేటీఆర్‌ను టార్గెట్ చేయడంతో.. ఇప్పుడు కవిత వర్సెస్ బీఆర్‌ఎస్‌గా సీన్ మారిపోయింది.
ప్రస్తుతం బీఆర్‌ఎస్ పార్టీకి కవిత కొరకరానీ కొయ్యగా తయారయ్యారు. బీఆర్‌ఎస్‌లో ఉంటూనే ఆమె జాగృతిని బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిరసనకు దిగారు. కాళేశ్వరం కమిషన్.. కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడంపై కవిత ఫైర్ అయ్యారు. అయితే కవిత ధర్నాకు బీఆర్‌ఎస్ నేతలెవ్వరూ హాజరు కాలేదు. అంతేకాకుండా కవిత విషయంలో ఏదైనా తేడా కొడితే.. హరీశ్ రావే స్వయంగా రంగంలోకి దిగి కౌంటర్‌ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే కవితకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేందుకు హరీష్ రావు రెడీ కాగా.. కేసీఆర్ ఆదేశాలతో వెనక్కి తగ్గారు. అందుకే హరీష్ రావు తీరుపై కవిత గుస్సా మీదున్న జన్మదిన శుభాకాంక్షలు చెప్పలేదని ప్రచారం జరుగుతోంది.
మరోవైపు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. రోజులో మూడు, నాలుగు గంటలు ట్విట్టర్ వేదికగా ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తుంటారు. అటు బీఆర్‌ఎస్ పార్టీలో చాలామంది లీడర్ల బర్త్‌డేలకు కూడా ట్విట్టర్‌లో శుభాకాంక్షలు చెబుతుంటారు.. కానీ తాజాగా మాత్రం హరీశ్ రావుకు కేటీఆర్ బర్త్‌డే విషేస్ చెప్పలేదు. ప్రస్తుతం డల్లాస్‌లో ఉన్న కేటీఆర్.. అక్కడ బిజీబిజీగా గడుపుతున్నారు. అందుకే హరీశ్‌రావుకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పలేదా.. ఇంకా ఏదైనా కారణముందా.. అనే చర్చ జరుగుతోంది. మొత్తానికి హరీష్‌రావుకు ఈ ఇద్దరు నేతలు కేటీఆర్, కవిత బర్త్‌డే విషేస్ చెప్పకపోవడం మాత్రం.. గులాబీ పార్టీలో చర్చనీయాంశంగా మారింది..
Also Read: RCB Victory Stampede: ఐపీఎల్ ట్రోఫీ ఆనందం ఆవిరి.. ఆర్సీబీ సంబరాల్లో తీవ్ర విషాదం
Also Read: Govt Employees Big Gift: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త.. తీపి కబురు అందించిన ప్రభుత్వం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook









