BRS Public Meeting: బీఆర్ఎస్ పార్టీ ఏర్పడి 25 వసంతాలు పూర్తయిన సందర్భంగా.. భారీ ఎత్తున రజతోత్సవ వేడుకలు జరిపేందుకు గులాబీ బాస్ కేసీఆర్ రెడీ అయ్యారు. ఏప్రిల్ 27న బీఆర్ఎస్ ప్లీనరీ సందర్భంగా ఓ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ సభను బీఆర్‌ఎస్ కంచుకోట వరంగల్‌లో నిర్వహించాలని గులాబీ బాస్ కేసీఆర్ నిర్ణయించారు. బాస్ ఆదేశాలతో ఓరుగల్లులో పలు ప్రాంతాలను మాజీమంత్రులు హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు పరిశీలించారు. ఆ తర్వాత ఓ వేదికను సభకు అనుకులంగా ఉంటుందని పార్టీ అధినేత కేసీఆర్‌కు వివరించారు. అంతా రెడీ అనుకున్న సమయంలో ఇప్పుడు బీఆర్‌ఎస్ అధినేత వరంగల్ సభ వేదికను ఊహించిన రీతిలో ఘట్ కేసర్‌కు మార్చడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.
అయితే కేసీఆర్ బహిరంగ సభ వేదికను వరంగల్ నుంచి ఘట్‌కేసర్‌కు మార్చడంపై పార్టీలో లోతైన చర్చ జరిగినట్టు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ఉమ్మడి వరంగల్ జిల్లాలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జిల్లాలో మొత్తం 12 నియోజకవర్గాలకు గానూ రెండుచోట్ల మాత్రమే గులాబీ పార్టీ జెండా ఎగిరింది. ఇందులో జనగామ నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి, స్టేషన్ ఘన్‌పూర్ నుంచి కడియం శ్రీహారి గెలుపొందారు. కానీ ఎన్నికల్లో కాంగ్రెస్ అనూహ్య విజయం సాధించడంతో.. కడియం శ్రీహారి అధికార పార్టీలో చేరిపోయారు. అటు కొందరు నేతలు కూడా అధికార పార్టీలోకి కండువాలు మార్చేశారు. మరికొందరు నేతలు మాత్రం.. గప్‌చుప్ అయ్యారు. ఇదే అంశం ఇప్పుడు గులాబీ బాస్‌ను ఆలోచనలో పడేసిందని టాక్. ఒకవేళ వరంగల్‌లో బహిరంగ సభ అట్టర్ ప్లాప్ అయితే పరిస్థితి ఏంటని గులాబీ బాస్ టెన్షన్ పడినట్టు సమాచారం. అందుకే బహిరంగ సభను ఘట్‌కేసర్‌కు మార్చినట్టు పార్టీలో చర్చ జరుగుతోంది.
అంతేకాదు.. ఘట్ కేసర్‌లో బహిరంగ సభ ఏర్పాటు వెనుక మరో కారణం కూడా ఉందని అంటున్నారు. ఘట్ కేసర్ ప్రాంతం హైదరాబాద్‌కు చాలా దగ్గరగా ఉంటుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్‌కు అత్యధిక సంఖ్యలో ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులోనూ దానం నాగేందర్, అరికెపూడి గాంధీ, ప్రకాశ్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి పార్టీ మారారు. అయినప్పటికీ బహిరంగ సభకు జనసమీకరణ పెద్ద సమస్య కాదని ఆయన భావిస్తున్నారట. గ్రేటర్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేల్లో ఒక్కో ఎమ్మెల్సీ కనీసం 5 వేల మందిని తరలించిన బహిరంగ సభ సక్సెస్‌అవుతుందని లెక్కలు వేశారట. ప్రస్తుతం రేవంత్ సర్కార్‌పై హైదరాబాద్‌లో చాలామంది గుర్రుగా ఉన్నారని కేసీఆర్ భావిస్తున్నారట. హైడ్రా పేరుతో రేవంత్ సర్కార్‌ను పేదలను ఇబ్బందులు పెట్టిందని అనుకుంటున్నారట. వారిలో కొందరు తమ సభకు స్వచ్చందంగా కూడా వచ్చే అవకాశం ఉందని లెక్కలు వేసుకుంటున్నారట. అందుకే కేసీఆర్ ఘట్‌కేసీఆర్ వైపు మొగ్గుచూపినట్టు పార్టీ నేతలు అంటున్నారు.
మరోవైపు వరంగల్‌లో ప్లీనరీని ప్రకటించాక.. ఆ జిల్లా నేతలు సైలెంట్ అయ్యారని చెబుతున్నారు. ప్రస్తుతం బీఆర్‌ఎస్‌కు ఉన్నది.. కేవలం ఒక్క ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మాత్రమే.. ఆయన ఒక్కరే మొత్తం ఖర్చు భరించడం తన వల్ల కాదని కేసీఆర్ ముందే చెప్పేశారట. అటు ఎన్నికల్లో ఓడిన మాజీ ఎమ్మెల్యేలు చేతి చమురు వదిలించుకునేందుకు రెడీగా లేకపోవడం కూడా ఓ కారణంగా చెబుతున్నారు. మొత్తంగా ఈ సమీకరణాలన్నీ పరిశీలించాకే గులాబీ కేసీఆర్ ఘట్‌కేసర్‌కు రజతోత్సవ వేడుకలను మార్చారని పార్టీ నేతలు అంటున్నారు.
Also Read: Welfare Schemes: ప్రజలకు భిక్షం మాదిరి కాకుండా సేవలా సంక్షేమ పథకాలు అందించాలి
Also Read: Kavya Maran Networth: ఐపీఎల్ క్వీన్ కావ్య మారన్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా.. వామ్మో అన్ని కోట్లా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









