Allu Arjun: జైలులో ఉంచడం వెనుక కుట్ర? అల్లు అర్జున్ రాత్రి జైలులో ఏం చేశాడో తెలుసా?
Doubts On Allu Arjun Not Released Night Time From Chanchalguda Central Jail: సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట కేసులో అరెస్టయిన సినీ నటుడు అల్లు అర్జున్ ఒక రాత్రి జైలులో ఉండడం వెనుక కుట్ర దాగిందనే వార్తలు కలకలం రేపుతున్నాయి.
Allu Arjun One Night In Jail: సినిమా థియేటర్‌లో తొక్కిసలాట ఘటనలో అరెస్టయిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జైలు నుంచి విడుదల కావాల్సి ఉండగా.. అనుకోని పరిస్థితుల్లో అతడు ఒక రాత్రి జైలులో గడపాల్సి వచ్చింది. ఈ పరిణామం అల్లు అర్జున్ కుటుంబసభ్యులు, మెగా అభిమానులు, అల్లు అర్జున్ అభిమానులు షాక్‌కు గురయ్యారు. కొద్దిసేపట్లో విడుదల అవుతాడని భావించిన వారందరూ నిర్ఘాంతపోయారు. న్యాయస్థానం మధ్యంతర బెయిల్ ఇచ్చిన కూడా విడుదల కాకపోవడం వెనుక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బెయిల్ పత్రాలు ఇచ్చినా కూడా హీరోను విడుదల చేయకపోవడంపై అల్లు అర్జున్ న్యాయవాదులు కుట్ర కోణం ఉందని ప్రకటించారు. దీనిపై న్యాయస్థానంలో పోరాటం చేస్తామని న్యాయవాదులు ప్రకటించారు.
Also Read: Allu Arjun: చట్టానికి కట్టుబడి ఉంటా.. అది జరగడం దురదృష్టకరం: అల్లు అర్జున్
హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలులో రాత్రంతా హైడ్రామా కొనసాగిన విషయం తెలిసిందే. రాత్రి 11 దాటాక అల్లు అర్జున్ విడుదల కావడం లేదని అందరికీ తెలిసింది. ఆ రాత్రి అల్లు అర్జున్ న్యాయవాది అశోక్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. 'అల్లు అర్జున్ బెయిల్ ఉత్తర్వులు అందిన తర్వాత కూడా అక్రమంగా నిర్బందించారు. హైకోర్ట్ బెయిల్ ఉత్తర్వుల్లో తక్షణం విడుదల చేయాలని స్పష్టంగా ఉన్నా జైలు అధికారులు పాటించలేదు. దీనికి ప్రభుత్వం, పోలీస్ శాఖ సమాధానం చెప్పాలి. ఈ అంశంపై తదుపరి న్యాయ ప్రక్రియ కొనసాగుతుంది. 'ఇది అక్రమ అరెస్ట్. దీనిపై న్యాయ పోరాటం చేస్తాం' అని న్యాయవాది అశోక్ రెడ్డి స్పష్టం చేశారు. 'జైలులో ఉండకూడదని హైకోర్టు చెప్పినా కూడా జైలులో ఉంచడం చాలా తప్పు. ఈ వ్యవహారాన్ని ఇంతటితో వదలం' అని ప్రకటించారు.
Also Read: K Kavitha: రేవంత్ రెడ్డి పిరికి ముఖ్యమంత్రి.. ఇక ఊరూరా పోరాటం చేస్తాం
జైలులో రాత్రంతా?
అరెస్టయి చంచల్‌గూడ జైలులో ఒక రాత్రి గడపాల్సి రావడంతో అల్లు అర్జున్ షాక్‌కు గురయ్యాడని తెలుస్తోంది. న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసినా కూడా తనను విడుదల చేయకపోవడంపై అల్లు అర్జున్ అసంతృప్తితో రగిలినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఖైదీ నంబర్ 7697 అని నంబర్ ఇవ్వడంతో ఆందోళన చెందినట్లు సమాచారం. ఈ పరిణామాలతో అల్లు అర్జున్ రాత్రి భోజనం చేయలేదని విశ్వసనీయ సమాచారం. ఇక రాత్రంతా చంచల్‌గూడ జైలులో నేలపైనే అల్లు అర్జున్ నిద్రపోయినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారాన్ని అల్లు అర్జున్ తేలికగా తీసుకోలేదని అతడి అభిమానులు చెబుతున్నారు. భవిష్యత్‌లో తీవ్ర పరిణామాలు ఉంటాయని ఫ్యాన్స్ పేర్కొంటున్నారు. 'అరెస్ట్ చేయడమే అక్రమం. దీనికి తోడు బెయిల్ ఇచ్చినా కూడా జైలు నుంచి విడుదల చేయకుండా రాత్రి జైలులో ఉంచడం'పై అల్లు అర్జున్ న్యాయవాదులు తీవ్రంగా పరిగణించినట్లు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter