Girlfriend Death: బెట్టింగ్‌ యాప్స్‌కు ఒకరు.. ప్రియుడు పెళ్లికి అంగీకరించలేదని లవర్‌

Within One Day Two Suicides In Hyderabad: హైదరాబాద్‌లో క్షణికావేశంలో ప్రాణాలు తీస్తున్నారు.. తీసుకుంటున్నారు కూడా. ఓ తల్లి తన ఇద్దరు పిల్లను చంపి ఆమె ఆత్మహత్య చేసుకోగా.. బెట్టింగ్‌ యాప్‌లతో ఓ యువకుడు, ప్రేమ విఫలమైందని ఓ యువతి వేర్వేగా ప్రాణాలు తీసుకున్నారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Apr 18, 2025, 04:38 PM IST
Girlfriend Death: బెట్టింగ్‌ యాప్స్‌కు ఒకరు.. ప్రియుడు పెళ్లికి అంగీకరించలేదని లవర్‌

Hyderabad Crime Rate: చిన్న చిన్న కారణాలకే విలువైన ప్రాణాలను యువత తీసుకుంటోంది. తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్‌ యాప్‌లు మరణాలకు యాప్‌లుగా మారాయి. ఇక ప్రేమ వ్యవహారం విషాదంగా మారుతున్నాయి. సులువుగా డబ్బులు సంపాదించుకోవడం కోసం ఆశ్రయిస్తున్న బెట్టింగ్‌ యాప్‌లు ప్రాణాలు తీస్తుండగా.. పెళ్లికి.. ప్రేమకు అంగీకరించలేదని యువతీ యువకులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. హైదరాబాద్‌లో ఒక రోజు వ్యవధిలో ఓ యువతి, యువకుడు ప్రాణాలు వదిలారు.

Add Zee News as a Preferred Source

Also Read: Daughter Last Rituals: 'మాయమవుతున్నాడమ్మ మనిషన్నవాడు'.. ఆస్తి కోసం రాని కొడుకు.. తండ్రికి కుమార్తె తలకొరివి

బెట్టింగ్ యాప్‌తో
సులభంగా డబ్బులు సంపాదించాలని బెట్టింగ్‌ యాప్‌లకు పాల్పడుతున్న యువత తీవ్ర నష్టాల్లో చిక్కుకుంటున్నారు. హైదరాబాద్‌లోని అత్తాపూర్‌లో ఉన్న రెడ్డి బస్తీలో ఓ యువకుడు బెట్టింగ్‌ యాప్‌లతో భారీగా నష్టపోయి చివరకు ప్రాణాలు తీసుకున్నాడు. జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన పవన్‌ మాసబ్‌ట్యాంక్‌లో జేఎన్‌టీయూలో ఎమ్ టెక్ చదువుతుండేవాడు. పవన్‌ బెట్టింగ్ యాప్స్‌కు అలవాటు పడ్డాడు. భారీ ఎత్తున బెట్టింగ్‌లకు పాల్పడుతూ ఇటీవల వరుస నష్టాలు ఎదుర్కొంటున్నాడు.

Also Read: Raj Tarun Lavanya: రాజ్‌ తరుణ్‌ కేసులో బిగ్‌ ట్విస్ట్‌.. లావణ్యపై తల్లిదండ్రుల దాడి

బెట్టింగ్ యాప్‌లో ఒకేసారి రూ.లక్ష పోగొట్టుకోవడంతో పవన్‌ తట్టుకోలేకపోయాడు. అప్పు తీర్చేందుకు తన వద్ద ఉన్న ఐఫోన్, రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ను అమ్మేశాడు. అయినా కూడా అప్పులు తీరకపోవడంతో తల్లిదండ్రులు పంపిన డబ్బులను కూడా బెట్టింగ్‌లో పెట్టాడు. పెట్టిన డబ్బులన్నీ పోవడంతో ఒక్క రూపాయి లాభం రాలేదు. దీంతో తీవ్ర మనస్తాపం చెంది తాను ఉంటున్న రూమ్‌లోనే బలవన్మరణానికి పాల్పడ్డాడు.

పెళ్లికి అంగీకరించలేదని..
ప్రియుడు పెళ్లికి ఒప్పుకోలేదని భవనం పైనుంచి దూకి ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. గచ్చిబౌలిలోని సిద్దిక్ నగర్‌లో నివసించే సుల్తానా బేగం (26) ఓ హోటల్‌లో వెయిటర్‌గా పనిచేస్తుండేది. మరో హోటల్‌లో పని చేస్తున్న కలకత్తాకు చెందిన సయ్యద్ షేక్ (29)తో కొంతకాలంగా ప్రేమాయణం సాగించింది. పెళ్లి ప్రస్తావన వస్తే అతడు నిరాకరించాడు. గురువారం తెల్లవారు జామున 4:30 గంటలకు స్నేహితుల ఫోన్‌తో షేక్‌కి ఫోన్ చేసి పెళ్లి చేసుకుందామని సుల్తానా కోరింది.

ఇంట్లో వేరే సంబంధాలు చూస్తున్నారని.. వెంటనే పెళ్లి చేసుకోవాలని కోరగా సయ్యద్‌ షేక్‌ నిరాకరించాడు. దీంతో మనస్తాపానికి గురైన యువతి తన ప్రియుడు ఉంటున్న షేక్ ఉంటున్న భవనం వద్దకు చేరుకుంది. భవనంపై ఐదో అంతస్తుపై నుంచి దూకి సుల్తానా ఆత్మహత్యకు పాల్పడింది. ఈ రెండు సంఘటనలపై ఆయా పోలీస్‌స్టేషన్‌ల పరిధిలోని పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనలతో బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదం నిండింది. క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాలతో కుటుంబాలకు తీరని శోకం మిగులుతోంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News