Woman Ant Phobia: చీమల భయంతో మహిళ ఆత్మహత్య... పోలీసులు బైటపెట్టిన షాకింగ్ విషయాలు..

Woman commits suicide due to ant phobia: ఏడాదిన్నర క్రితం.. తమ పాపకు  మనీషా డైపర్ మార్చింది . అప్పుడు దానిలో చీమలు ఉండటంతో పాప చాలా ఏడ్చింది. అప్పటి నుంచి ఈ ఫోబియా మరింత ఎక్కువగా అయ్యిందని  మనీష భర్త శ్రీకాంత్‌ పోలీసులు విచారణలో తెలిపాడు.  

Written by - Inamdar Paresh | Last Updated : Nov 7, 2025, 04:22 PM IST
  • చీమల భయంతో మహిళ సూసైడ్..
  • షాక్ లో నెటిజన్లు..
Woman Ant Phobia: చీమల భయంతో మహిళ ఆత్మహత్య... పోలీసులు బైటపెట్టిన షాకింగ్ విషయాలు..

Woman commits suicide due to ant phobia in sangareddy: ఇటీవల సంగారెడ్డి జిల్లాలోని అమీన్ పూర్ లో  మనీషా అనే వివాహిత చీమల భయంతో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పెనుసంచలనంగా మారింది. ఈ కారణంతో కూడా ఆత్మహత్యకు పాల్పడతారా అంటూ నెట్టింట రచ్చ మొదలైంది. ఈ క్రమంలో తాజాగా.. ఈ ఘటనలో పోలీసులు షాకింగ్ నిజాల్ని బైటపెట్టారు.

Add Zee News as a Preferred Source

 మంచిర్యాలకు చెందిన చిందం శ్రీకాంత్‌, ద్యావనపల్లి మనీషా (25) దంపతులు అమీన్ పూర్ లో ఉంటున్నారు. మనీషా చిన్నతనం నుంచి పూర్వజన్మలు, తప్పిదాలకు పనిష్మెంట్ లు వంటి కథలు, సినిమాలు ఎక్కువగా చూసేది. దీంతో క్రమంగా ఆమెలో ఒకరకమైన ఫొబియా వచ్చిందని తెలిపారు. ఏడాదిన్నర క్రితం.. పాపకు మనీషా డైపర్ వేసింది. అప్పుడు.. దానిలో కొన్ని చీమలు కుట్టడం వల్ల పాప ఆగకుండా ఏడ్చింది.

ఇది మనిషాపై తీవ్ర ప్రభావం చూపించిందని భర్త అన్నాడు. అప్పటి నుంచి ఆమెకు ఈ ఫోబియా అంటుకున్నట్లు మనీష భర్త శ్రీకాంత్‌ పోలీసులు విచారణలో తెలిపాడు. కొంత మంది సోషల్ మీడియాలో ఈ అంశం గురించి అదే పనిగా ట్రోల్స్ చేయడంతో కుటుంబ సభ్యులు కూడా దీనిపై విచారం వ్యక్తం చేసినట్లు తెలుస్తొంది.

చీమలు గురించిన ఈ భయాన్ని మిర్మికో ఫోబియా అంటారు. ఇదొక తీవ్రమైన భయంతో కూడిన మానసిక స్థితి అని ఆమె భర్త చెప్పుకొచ్చాడు.ఈ రుగ్మత ఉన్నవారు.. చిన్న చీమను కూడా ఏనుగంత పెద్దదిగా ఊహించుకుని ఆందోళన చెందుతారు. ఇవి తమ శరీరంలోకి ప్రవేశించినట్లు తమ అవయవాలను కొరికి తింటున్నట్లు తీవ్ర భయానికి గురవుతారు.

Read more: Brs Ktr: తెలంగాణ, హైదరాబాదుకు పట్టిన ఈ గ్రహణం వీడాలి.!. కేటీఆర్ సంచలన ట్విట్.. ఏమన్నారంటే..?

ఈ ఘటనపై విచారణ జరిపిన పోలీసులు కూడా మనీషా ఆత్మహత్య చేసుకుందని వెల్లడించారు. పోస్ట్‌ మార్టంలో సైతం ఆమెది ఆత్మహత్య అనే విషయం బైటపడింది.  మొత్తంగా చీమల భయంతో ఒక మహిళ నిండు ప్రాణాలు తీసుకొవడం మాత్రం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు కారణమైంది. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook 

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News