Nagarkunool woman Gangrape: ఉగాది రోజు ఘోరం.. దైవదర్శనానికి వెళ్లిన యువతిపై గ్యాంగ్ రేప్..

nagarkurnool woman gang rape: ఉగాది రోజున తన కుటంబంతో కలిసి హనుమంతుడి ఆలయంకు వెళ్లిన యువతికి షాకింగ్ అనుభవం ఎదురైంది. కొంత మంది కేటుగాళ్లు ఆమె మీదదాడి చేసి గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. ఈ  ఘటన స్థానికంగా దుమారంగా మారింది.

Written by - Inamdar Paresh | Last Updated : Mar 31, 2025, 12:41 PM IST
  • యువతిపై గ్యాంగ్ రేప్..
  • నాగర్ కర్నూల్ లో ఘోరం..
Nagarkunool woman Gangrape: ఉగాది రోజు ఘోరం.. దైవదర్శనానికి వెళ్లిన యువతిపై గ్యాంగ్ రేప్..

Woman Gang rape in nagarkunool: ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చిన కామాంధులు మారడం లేదు. గుడి, బడి, బస్టాండ్, మెట్రో, ఆఫీసు ఇలా ప్రతి చోటు కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. మహిళ కన్పిస్తే చాలు ..తమ పశువాంఛ కోసం దాడులు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే నిర్భయ, పోక్సో.. వంటి కఠిన చట్టాలు అమలు చేసిన కూడా కామాంధుల్లో మాత్రం మార్పులు రావడంలేదు.  ప్రతిరోజు కూడా మహిళలపై వేధింపులు, అత్యాచారాల ఘటనలు వార్తలలో ఉంటున్నాయి. చివరకు ఉగాది పండగ పూట హనుమంతుడి ఆలయంకు వెళ్లిన యువతిపై కూడా అత్యాచారం జరిగింది. ఈ ఘటన మాత్రం తెలంగాణలో సంచలనంగా మారింది.

Add Zee News as a Preferred Source

నాగర్‌కర్నూల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఉగాది సందర్భంగా ఒక కుటుంబం దైవదర్శనానికి వెళ్లింది. ఈ క్రమంలో సదరు యువతిని కొంత మంది కామాంధులు గమనించారు. ఆమెపైన కన్నేశారు. ఊరుకొండ మండలం ఊరుకొండ పేట ఆంజనేయ స్వామి దేవలయ సమీపంలో  ఈ ఘటన చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులంతా ఆలయంలో మొక్కులు తీర్చుకుంటున్నారు.

ఇంతలో యువతి బహిర్భూమికి వెళ్లాల్సి వచ్చింది. ఆమె మరోకరితో వెళ్తుంది. అప్పటికే ఆమె మీద కన్నేసిన నీచులు.. వాళ్ల వెంటే వెళ్లారు. ఆ తర్వాత.. యువతిపై మూకుమ్మడిగా దాడులు చేశారు. మహిళతో వచ్చిన బంధువుపై దాడి చేశారు. యువతిని లాక్కెళ్లి.. ఎనిమిది మంది గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. దుర్మార్గుల పశుబలం ముందు..యువతి విలవిల్లాడిపోయింది. ఘటన తర్వాత నీచులంతా పారిపోయారు. ఆ తర్వాత యువతి తన బంధువులతో కలసి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Read more: Uttar Pradesh Crime: బరి తెగించిన మరో భార్య.. విషం కల్పిన కాఫీని భర్తతో తాగించి.. కారణం తెలిస్తే షాక్ కాదు.. షేక్ అవుతారు..

మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు ఆరుగురు నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మరో ఇద్దరు యువకులు పరారీలో ఉన్నట్లు సమాచారం. వారి కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు.  దైవదర్శానికి వెళ్లిన యువతికి ఇలాంటి ఘటన ఎదురుకావడం స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. దుర్మార్గులను కఠినంగా పనిష్మెంట్ చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News