Aghori Marriage: రెండు తెలుగు రాష్ట్రాల్లో హాల్‌చల్ చేస్తున్న అల్లూరి శ్రీనివాస్ అలియాస్ అఘోరీపై తాజాగా ఒక యువతి సంచలన ఆరోపణలు చేసింది. అఘోరీతో తనకు ఇప్పటికే పెళ్లి అయిందని, అయినా ఇప్పుడు మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడని మీడియా ముందు వాపోయింది. జనవరి 1న తనను పెళ్లిచేసుకుంటే, కేవలం 12 రోజుల వ్యవధిలోనే మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని, దీనిపై వెంటనే పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
హైదరాబాద్‌లోని అమ్మవారి గుడిలో జరిగిన ఘటన తరువాత అఘోరీ నగ్నంగా సంచరిస్తూ పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. తన కారులో సెల్ఫ్ డ్రైవ్ చేసుకుంటూ అనేక గుడులను, ప్రదేశాలను చుట్టివస్తూ గణనీయంగా పేరు గడిచింది. అయితే అనేక ప్రదేశాల్లో తనకు అడ్డు వచ్చిన వారిని నిలువరించేందుకు పెట్రోల్ పోసుకోవడం, మహిళల ముందు కూడా నగ్నంగా సంచరించడం వంటివి చేయడంతో అఘోరీలు ఇలా కూడా ఉంటారా..? అనే విధంగా జనం మాట్లాడుకోవడం ప్రారంభించారు. హిందుమత వ్యాప్తికి అఘోరీ మంచి ప్రయత్నం చేస్తుందని చెప్పుకున్న వారు కూడా ఇలా అమ్మాయిల విషయంలో ఆరోపణలు ఎదుర్కోవడంపై మండిపడుతున్నారు.
కొద్ది రోజులు ఉండటానికి అవకాశం ఇచ్చిన హిందు కుటుంబానికి చెందిన అమ్మాయినే తీసుకెళ్లడం, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం పై కూడా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అఘోరీ చేసే పనుల వల్ల ఏ ఇంటి అమ్మాయి అయినా... ఆ కుటుంబం సమాజంలో ఎదుర్కోనే నగుబాటుకు అనే కారణం అవుతాడని విమర్శిస్తున్నారు. పెళ్లి చేసుకోవడం పక్కన పెడితే ప్రతిరోజు మీడియాలో కనిపించి, ఆ అమ్మాయి సోదరుడిని, ఆ కుటుంబాన్ని గురించి చర్చించడంపై ఆ కుటుంబం ఎంత మథన పడుతుందో ఒక్కసారి ఆలోచించుకోవాలని సూచిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే మరో అమ్మాయి తనను జనవరి 1న పెళ్లి చేసుకున్నాడని, కేవలం 12 రోజుల వ్యవధిలోనే మరో పెళ్లి చేసుకోవడం తనను మోసం చేయడమేనని తాజాగా ఆరోపణలు చేసింది. అఘోరీ మరో అమ్మాయిని ఇలా మోసం చేయకుండా ఉండేందుకే తాను బయటకు వచ్చి మాట్లాడుతున్నానని వాపోయింది. హిందు ధర్మం పేరుతో అఘోరీ చేస్తున్న చర్యలపై హిందు సమాజం కూడా మండిపడుతున్నది. దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా హిందు మతం కోసం, ధర్మం కోసం అనేక మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా పనిచేస్తున్నప్పటికీ, కేవలం అఘోరీ శ్రీనివాస్ మాత్రమే ప్రతిరోజు ఏదో ఒక మీడియా సంస్థకు, లేదా యూట్యూబ్ చానెళ్లకు ఇంటర్వ్యూలు ఇవ్వడంపై కూడా నిజమైన హిందు భక్తులు మండిపడుతున్నారు. అతను ఏనాడు సనాతనధర్మం దారిలో నడవలేదని, కేవలం మీడియాలో కనిపించాలనే ఉద్దేశ్యంతోనే ఇలా వ్యవహిస్తున్నదనే విమర్శలున్నాయి. దేశంలో అనేక మంది అఘోరీలున్నా.. కేవలం శ్రీనివాస్ మాత్రమే దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కావడం గమనార్హం.
Also Read: Telangana SC Reservation: నేటి నుంచి తెలంగాణ ఎస్సీ వర్గీకరణ అమలు.. 30 ఏళ్ల పోరాటానికి ఫలితం..
Also Read: Telangana Rains: అకాల వర్షంతో అంతా ఆగమాగం.. తెలంగాణలో 2 రోజుల పాటు భారీ వర్షాలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









