Yadadri Brahmothsavalu: యాదగిరి గుట్టలో కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహా స్వామి దివ్యక్షేత్రంలో లక్ష్మీ నృసింహ స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్బంగా క్షేత్రాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఏటేటా నిర్వహించినట్లు కాకుండా ఈసారి స్వర్ణ విమాన గోపురం కలిగి కొత్త అనుభూతితో ఉత్సవాలు నిర్వహించనున్నారు.బ్రహ్మోత్సవాల సందర్భంగా శనివారం స్వస్తివాచనం, రక్షాబంధనం, అగ్ని ప్రతిష్టతో ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలు 7వ తేదీ స్వామి అమ్మవారి ఎదుర్కోళ్ల ఉత్సవం, 8వ తేదీ తిరు కల్యాణ మహోత్సవం, 9వ తేదీ దివ్య విమాన రథోత్సవం నిర్వహించనున్నారు. 11న గర్భాలయంలోని మూలవరులకు నిర్వహించే సహస్ర ఘటాభిషేకంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమవుతాయి. బ్రహోత్సవాల నేపథ్యంలో ఈ నెల 11 వరకు స్వామివారి నిత్యకల్యాణం, శ్రీసుదర్శన నారసింహ హోమాలను రద్దు చేసినట్లు ఆలయ ఈవో వెల్లడించారు.
ఇదీ చదవండి: అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.
ఇక స్వామివారి కల్యాణోత్సవంలో పాల్గొనే భక్తులు 3 వేల రూపాయలు చెల్లించి టికెట్ తీసుకొని సాంప్రదాయ దుస్తులతో భక్తులు పాల్గొనాలని దేవస్థాన అధికారులు సూచించారు. ఎండలు దంచి కొడుతుంటడంతో కొండ బండ నుంచి ఉపశమనం పొందేందుకు తిరు వీధుల్లో పూర్తిగా తెలుపు రంగు వేశారు.
దేవదేవుడి బ్రహోత్సవాలకు వచ్చే భక్తుల కోసం ధార్మిక, సాహిత్య, సంగీత మహాసభలు నిర్వహించనున్నారు. గరికపాటి నరసింహారావు ప్రవచన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు, భక్తి సంగీతం, చిందు యక్షగానం, ధార్మిక ఉపన్యాసాలు, పౌరాణిక నాటక ప్రదర్శనలు, జాతీయ, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన కళాకారులు సంగీత కార్యక్రమాలు ఉంటాయి. ఆలయం లోపల, బయట కొండ చుట్టూ విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు.
ఇదీ చదవండి: Liquor Rates Hike: మందుబాబుకు భారీ షాక్.. భారీగా పెరిగిన బీర్ల ధరలు..
ఇదీ చదవండి: ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. బేసిక్ పేలో భారీ పెంపు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









