mlc Kavitha on mmts rape incident: సికింద్రాబాద్-మేడ్చల్ వెళ్లే ఎంఎంటీఎస్ రైలులో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. నిన్న రాత్రి ఎంఎంటిఎస్ ట్రైన్ లో.. మహిళ ఒంటరిగా ప్రయాణిస్తుంది. ఇది గమనించిన ఆగంతకుడు మహిళ దగ్గరకు వెళ్లి అఘాయిత్యానికి యత్నించాడు. మహిళ అతని నుంచి తప్పించుకుని.. రన్నింగ్ ట్రైన్ లో నుంచి కిందకు దూకేసింది. హైదరాబాద్, కొంపల్లి ఎంఎంటిఎస్ ట్రైన్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. వెంటనే స్థానికులు గమనించి మహిళను గాంధీ ఆస్పత్రికి తరలించారు.
మహిళకు వైద్యులు మెరుగైన వైద్య సేవలు అందించారు. ఈ ఘటనపై స్థానికులు జీఆర్పీ పోలీసులకు సమాచారం అందించారు. జీఆర్పీ పోలీసులు ఆస్పత్రికి చేరుకుని బాధితురాలి నుంచి స్టేట్‌మెంట్ తీసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సదరు మహిళ అనంతపురం జిల్లాకు చెందిన యువతిగా గుర్తించారు. మేడ్చల్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో యువతి ఉద్యోగం చేస్తోంది.
ఈ ఘటనపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. తెలంగాణలో మహిళలపై దాడులు, అఘాయిత్యాలు క్రమంగా పెరిగాయన్నారు. మహిళల భద్రత ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారిందన్నారు. సదరు మహిళ హెల్త్ గురించి కవిత డాక్టర్లతో మాట్లాడారు. అదే విధంగా సికింద్రాబాద్ రైల్వే ఎస్పీ చందనా దీప్తితో కూడా మాట్లాడారు. నిందితుడిని తొందరగా పట్టుకొవాలన్నారు. ట్రైన్ లలో మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా పొలీస్ లను బందోబస్తుకు ఏర్పాటు చేయాలన్నారు. మరోవైపు.. మహిళలను కాపాడటంతో.. తెలంగాణ సర్కారు పూర్తిగా విఫలమైందన్నారు. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు జరుగుతున్న రేవంత్ సర్కారు..పట్టించుకోవడంలేదన్నారు.
Read more: Hyderabad Rape Incident: హైదరాబాద్ MMTS రైలులో మహిళపై అత్యాచార యత్నం..
ఈ ఘటనపై బీఆర్ఎస్ నేతలు కూడా తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. బాధితురాలిని గాంధీ ఆస్పత్రిలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ , సబితా ఇంద్రా రెడ్డితో కలిసి పరామర్శించారు. దీనిపై కఠినంగా చర్యలు తీసుకొవాలని సీఎం రేవంత్ సర్కారును డిమాండ్ చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.