Mothers Day: మదర్స్‌ డే ట్వీట్‌ వైరల్‌.. పర్వాలేదు మాజీ సీఎం వైఎస్ జగన్‌కు 'అమ్మ' గుర్తు ఉంది

Ex CM YS Jagan Mothers Day Wishes Goes Viral: ప్రపంచవ్యాప్తంగా మాతృ దినోత్సవాన్ని అందరూ ఘనంగా.. కన్నతల్లి గుర్తుంచుకునేలా చేసుకుంటుంటారు. మదర్స్‌ డే సందర్భంగా మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ చేసిన ట్వీట్‌ వైరల్‌గా మారింది. అతడి ట్వీట్‌ చర్చనీయాంశంగా మారింది. అదేంటో తెలుసుకుందాం.

Written by - Ravi Kumar Sargam | Last Updated : May 11, 2025, 02:42 PM IST
Mothers Day: మదర్స్‌ డే ట్వీట్‌ వైరల్‌.. పర్వాలేదు మాజీ సీఎం వైఎస్ జగన్‌కు 'అమ్మ' గుర్తు ఉంది

YS Jagan Mothers Day: ప్రపంచవ్యాప్తంగా మే రెండో ఆదివారాన్ని మాతృ దినోత్సవంగా చేసుకుంటుంటారు. ఈ ఆదివారం మదర్స్‌ డే కావడంతో అందరూ తమ తమ తల్లికి శుభాకాంక్షలు చెబుతూ.. కానుకలు ఇస్తూ ఎంతో ఆనందంగా చేసుకుంటున్నారు. ఈ క్రమంలో మరికొందరు తమ తల్లి గుర్తుంచుకునేలా ఏదో ఒక సర్‌ప్రైజ్‌ చేస్తున్నారు. అయితే వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కూడా సర్‌ప్రైజ్‌ చేశారు. ఇన్నాళ్లు మరచిపోయిన తన తల్లికి శుభాకాంక్షలు చెప్పడం గమనార్హం. 'ఎక్స్‌'లో పోస్టు చేసిన ఆ ట్వీట్‌ వైరల్‌గా మారింది. అతడి ట్వీట్‌ చర్చనీయాంశంగా మారింది. అదేంటో తెలుసుకుందాం.

Add Zee News as a Preferred Source

Also Read: TS Eamcet Result 2025 LIVE: తెలంగాణ ఎప్‌సెట్‌ ఫలితాలు విడుదల.. ఒక్క క్లిక్‌తో ఇలా తెలుసుకోండి

మాతృ దినోత్సవం సందర్భంగా తల్లులందరికీ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ‘మీ ప్రేమ, బలం, త్యాగం అపరిమితమైనవి. ఎప్పటికీ మిమ్మల్ని గౌరవిస్తూనే ఉంటాం' అని వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు. ఆఖరులో 'మాతృ దినోత్సవం శుభాకాంక్షలు అమ్మ’ అని ప్రత్యేకంగా రాసుకొచ్చారు. అంటే వైఎస్ జగన్ పరోక్షంగా తన తల్లి వైఎస్‌ విజయమ్మకు శుభాకాంక్షలు చెప్పరా? లేదంటే అందరి తల్లులకు కలిపి శుభాకాంక్షలు చెప్పరా? అనేది చర్చనీయాంశంగా మారింది. కుటుంబపరంగా.. ఆర్థికపరమైన అంశాలతోపాటు రాజకీయంగా తన తల్లి వైఎస్‌ విజయమ్మతో వైఎస్‌ జగన్‌కు భేదాభిప్రాయాలు వచ్చాయి. ఆ పొరపొచ్చాలు మరింత తీవ్రమవుతున్నాయి. ఇటీవల తన తల్లి వైఎస్‌ విజయమ్మ పుట్టినరోజు వైఎస్‌ జగన్‌ శుభాకాంక్షలు తెలపలేదు. అలాంటి ఇప్పుడు ప్రత్యేకంగా 'అమ్మ' అంటూ శుభాకాంక్షలు చెప్పాడంటే ఏం జరుగుతుందోనని వైఎస్‌ కుటుంబ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

Also Read: TS EAPCET Results: వివాదంలో తెలంగాణ ఎప్‌సెట్‌ ఫలితాలు.. హరీశ్‌ రావు ఖండన

ఇక వైఎస్‌ జగన్‌ సోదరి, కాంగ్రెస్‌ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల కూడా శుభాకాంక్షలు తెలిపారు. భారత్‌ పాకిస్థాన్‌ యుద్ధంలో ప్రాణాలు వదులుతున్న అమరవీరుల తల్లులకు ఈ మదర్స్‌డేను షర్మిల అంకితం చేశారు. 'జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ ' మాతృభూమి రక్షణ కోసం అసువులు బాసిన జవాన్ మురళి నాయక్ లాంటి వీరులను కన్న  తల్లులకు, మన దేశ రక్షణ కోసం.. కన్నప్రేమను పణంగా పెట్టిన వీరమాతలకు ఈ మదర్స్ డే అంకితం' అని వైఎస్‌ షర్మిల తెలిపారు. 

'ఈ దేశ ముద్దుబిడ్డలు మన సైనికులు. ఇలాంటి రక్షకులకు జన్మనిచ్చిన ప్రతి తల్లికి మాతృదినోత్సవ శుభాకాంక్షలు. యుద్ధభూమిలో బిడ్డను కోల్పోయిన దుఃఖాన్ని దిగమింగుతూ.. దేశం కోసం  ప్రాణత్యాగం చేశాడనే గర్వాన్ని చూపే అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే' అని వైఎస్‌ షర్మిల కొనియాడారు. మనిషి జన్మకు.. గమనానికి మూలం అమ్మ. ఈ సృష్టిలో అమ్మ ప్రేమకు సమానమైనది మరొకటి లేదు. అమ్మ ప్రేమ, దీవెనలే మనకు కొండంత అండ' అని వైఎస్‌ షర్మిల వివరించి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. FacebookTwitter

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News